సాధారణంగా మనం ఎక్కువ పని చేసినప్పుడు లేదా అలసిపోయినప్పుడు తీవ్రంగా నొప్పులు రావడం సహజం.. కానీ పెద్దవాళ్లకు వయసు పెరుగుతున్న కొద్దీ నొప్పులు కూడా అంతే స్థాయిలో వస్తూ ఉంటాయి. ఇక వారు ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం నొప్పి వచ్చిన ప్రతిసారి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ను ఉపయోగిస్తూ కొంత వరకు ఉపశమనం పొందుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అనేది స్లో పాయిజన్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలు పని చేయడం కూడా ఆపేస్తాయట.. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కి బదులు ఇప్పుడు ఒక చిట్కా పాటించి చూడండి.. ఎటువంటి నొప్పులు అయినా ఇట్టే పరార్ అవుతాయి.


ఆ ఆకు ఏదో కాదు వావిలాకు.. ఈ ఆకు గురించి ఇప్పటి తరం వారికి తెలియకపోయినా ఆ నాటి కాలంలో మన పెద్దలకు బాగా తెలుసు.. ఈ వావిలాకు ను స్త్రీలు డెలివరీ అయిన తర్వాత వారు స్నానం చేసే నీటిలో వీటిని ఉపయోగించే వారు.. వేడినీళ్లలో ఈ ఆకులను వేసి, ఆ తరువాత ఈ ఆకుల నుంచి వచ్చే సారంతో స్నానం చేయడం వల్ల శరీరంలో నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి.. ఇక కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి ఈ వావిలాకు ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది..


ఇక ఈ ఆకులను చాలా మెత్తగా నూరి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని రాయాలి..ఇలా రాయడం వల్ల వాపులు నొప్పులు వెంటనే తగ్గిపోతాయి..

జలుబు, గొంతునొప్పి, దగ్గు ,జ్వరం వంటి సమస్యలు ఉన్నప్పుడు.. ఈ వావిలాకులను ఎండబెట్టి రెండు కప్పుల నీటిలో అర్థ టేబుల్ స్పూన్ ఈ పొడిని వేసి, ఆ నీరు ఒక కప్పు అయ్యేవరకు మరిగించి , వడగట్టి సేవించడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఈ ఆకులను దిండుగా చేసి తల కింద పెట్టుకోవడం వల్ల తరచూ వచ్చే తలనొప్పి, జ్వరం కూడా తగ్గిపోతాయి..


ఈ ఆకులో విటమిన్ ఇ, విటమిన్ సి ,ఫ్లెవనాయిడ్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్  లు కూడా ఉన్నాయి. కాబట్టి జుట్టు ఊడిపోకుండా , ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి..


ఈ ఆకులను బాగా దంచి రసం తీసి , అందులో నువ్వుల నూనె వేసి మరగనివ్వాలి. అప్పుడు ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవచ్చు . ఇక మీకు కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, బాడీపెయిన్స్ ,తలనొప్పి, కీళ్లనొప్పులు ఇలా నొప్పులు వచ్చిన చోట నూనెను రాయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: