ఉదయం పూట లేవగానే మనం వ్యాయామం చేయడం ద్వారా, దేహానికి, గుండెకు చాలా మంచిదని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రక్తపోటు సమస్య, డయాబెటిస్ ఉండేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నది. అందుచేతనే హార్ట్ పేషెంట్ లు ప్రతిరోజు వ్యాయామం, నడిచే అలవాటు చేసుకోవాలి. కొంతమంది పరిశోధకులు 88,320 మందిపై ఈ పరిశోధనలు చేసి, వారి గురించి తెలుసుకొని వారిచేత నడక అలవాటు చేయించి ఆ వ్యక్తుల లో ఉండేటువంటి గుండెపోటు సమస్యను తగ్గించినట్లు తెలియజేశారు.
ముఖ్యంగా ఏలాంటి వ్యాయామం చేయాలనే ఈ విషయంపై వైద్యుల సలహా తీసుకొని మొదలుపెట్టాలట. మికు ఉన్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు మీరు ఎటువంటి వ్యాయామం చేయడం కరెక్ట్ తెలియజేస్తారు. వ్యాయామం చేయడం వల్ల ఎక్కువగా రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు.
1).ఏరోబిక్స్ అనే వ్యాయామం చేయడం వల్ల, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ కూడా గుండెకు బాగా పనిచేస్తుంది. ఇందులో సులువైన ఆసనాలు మాత్రమే వేయాలి.
2). ఉదయం పూట స్విమ్మింగ్ చేయవచ్చు. కానీ ఎక్కువ అ ఒత్తిడి వచ్చేలా చేయరాదు. వారంలో రెండు రోజులు అయినా స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా మంచిది.
3). వ్యాయామం చేసేటప్పుడు ఛాతి నొప్పి, కళ్ళు తిరగడం మట్టి జరిగితే వెంటనే యమన్ నిలిపివేయాలి.
మన ఊపిరితిత్తుల ప్రక్కటెముకల మధ్య గుండె ఉంటుంది. గుండె బరువు 450 గ్రాములు ఉంటుంది. ఈ గుండె ద్వారా ప్రసారం అయ్యేటప్పుడు.. ఆక్సిజన్ సరిగా అందకుంటే అందులో ఉండే ఎటువంటి కరోనరి ఆర్డరీలు నిలిచిపోతాయి. ఆ వ్యక్తికి గుండెపోటు వస్తుంది. ఇది ముఖ్యంగా క్రొవ్వు పదార్థాలు తినడం వల్ల వస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి