కరోనా వైరస్ ప్రస్తుతం పట్టి పీడిస్తూనే ఉంది.. ఇప్పటికే మూడు దశల కరోనా వైరస్  దేశంలో విజృంభించింది అన్న విషయం తెలిసిందే. ఇక మూడు దశల్లో కూడా ప్రతి ఒక్కరిలో ప్రాణ భయాన్ని కలిగించింది. ఎంతో మందిని ఈ మహమ్మారి వైరస్ మృత్యుఒడిలోకి చేర్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఎన్నో కుటుంబాలలో కూడా విషాదాన్ని నింపింది. అయితే ఒకప్పుడు కరోనా వైరస్ పేరెత్తితే చాలు భయపడిపోయే వారు జనాలు. ఒకసారి వైరస్ బారిన పడితే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే అనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రతి ఒక్కరి ఆలోచన తీరులో మార్పు వచ్చింది అని చెప్పాలి.


 ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉండటం ఇక మరోవైపు కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరికి అవగాహన రావడం నేపథ్యంలో ఇక వైరస్ నుండి భయటపడి నప్పటికీ ఎలాంటి భయం అక్కర్లేదని తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడిన తర్వాత కూడా పలు జాగ్రత్తలు తీసుకుని కోలుకుంటున్నారు ఎంతోమంది. దీంతో నేటి రోజుల్లో కరోనా వైరస్ మరణాల రేటు చాలా తక్కువగానే ఉంది అనే చెప్పాలి. అయితే ఇలా కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నాము అని అందరూ సంతోషపడుతున్న సమయంలో ఇక పోస్ట్ కోవిడ్ లక్షణాలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి.



 కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఇబ్బందులు సుదీర్ఘకాలంపాటు ఎంతోమందిని బాధపడుతూ ఉన్నాయి. కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని ఎంత కాలమైనా సరే ఎంతో మందిని కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ విషయాన్ని అమెరికాలోని హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా నుంచి రికవరీ అయిన వారిలో గుండె సంబంధిత సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తున్నాయ్ అని అధ్యయనంలో తేలింది అంటూ చెప్పుకొచ్చారు. గుండెల్లో మంట గుండె నాలాల్లో రక్తం గడ్డ కట్టడం హృదయస్పందన లో మార్పు లాంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. అమెరికాలో 1.1 కోట్ల మంది పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: