ప్రస్తుత రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ కి ఎంత డిమాండ్ ఉంది అన్నది తెలిసిందే. కారణం ఏదైనా ఎదో ఒక సాకుతో తరచూ ఫాస్ట్ ఫుడ్స్ ని తినేస్తుంటారు జనాలు. ముఖ్యంగా యువత అయితే చైనీస్ వంటకం అయిన నూడిల్స్ కి బాగా అలవాటు పడిపోయింది. ఎక్కువ మంది నూడిల్స్ ను తినడానికి ఇష్టపడతారు. కొంత మంది అయితే ఒక పూట భోజనం రెగ్యులర్ గా నూడిల్స్ ను లాగించేస్తుంటారు. అయితే నూడిల్స్ మన ఆరోగ్యానికి ఎంత హానికరం అన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

శరీర క్రియలు సక్రమంగా సాగడానికి   పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపెడుతుంది అన్నది తెలిసిందే. నూడిల్స్ అనేది జంక్ ఫుడ్.  అయితే నూడిల్స్ తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి ఆరోగ్య  నిపుణులు ఏమి చెబుతున్నారు అంటే...వీటిల్లో మనకు అవసరమైన పోషకాలు తగిన స్థాయిలో ఉండవు.  అదే కాకుండా వీటిని తరచూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది.  నూడుల్స్ ను రెగ్యులర్ గా తింటే ఊబకాయం భారిన పడటం ఖాయం అంటున్నారు. తద్వారా ఈజీగా బరువు పెరిగిపోతారు.

నూడుల్స్ వంటి జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినడం వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం మెల్లమెల్లగా క్షీణించిపోతుంది. తద్వారా శరీరంలో అలసట పెరిగి నీరసంగా అనిపిస్తుంటుంది.  నూడుల్స్ పురుషుల పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి కనుక తరచూ తింటే వీరిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.  నూడుల్స్ లో ఉండే సింథటిక్ పదార్థాలు సెక్స్ హార్మోన్లను డిస్ట్రర్బ్ చేసి ఇలా ఇబ్బంది పెడతాయి.
డయాబెటిస్ ఉన్నవారు నూడుల్స్ ను అస్సలు తినకూడదని చెబుతున్నారు.   నూడిల్స్ లో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుందట... కాబట్టి  మధుమేహం ఉన్న వారు ఖచ్చితంగా నూడిల్స్ ను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: