
అంతేకాకుండా నేటి రోజుల్లో ఇక అధునాతన టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మొబైల్ ప్రియులందరికీ కూడా సెల్ఫోన్ ప్రపంచం మరింత అందంగా మారిపోయింది. ఇక కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉండడంతో మొబైల్ లో ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో ఎక్కడి కి వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. కాగా ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు మొబైల్ వాడకం అయితే మరింత పెరిగి పోతుంది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మొబైల్ ఎక్కువగా వాడితే ఇక మనుషుల పై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.
మరీ ముఖ్యంగా మగవారు మొబైల్ ఎక్కువగా వాడితే మరింత ప్రమాదం అంటూ చెబుతున్నారు. మగవారు ఫోన్ ఎక్కువగా వాడితే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను మితిమీరిన వాడకంతో పాటు ఆహార లోపాలు శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి లాంటి కారణాలతో పురుషుల్లో సంతానలేమి లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎలక్ట్రికల్ వస్తువుల నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఇందుకు కారణం అంటూ చెబుతున్నారు. కాగా దేశంలో 23 శాతం మంది మగవారు ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉండటం గమనార్హం.