మన వంటింట్లో ఉండే పదార్థాలతో ఒక హెల్తీ జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల  చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.ఇంకా అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల అధిక పొట్ట సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా ఈ జ్యూస్ మన శరీరంలో మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గేలా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో  చాలా మంది కూడా అధిక బరువు, అధిక పొట్ట వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం అవుతున్నాయి. అధిక బరువు వల్ల మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అధిక బరువు, అధిక పొట్ట వల్ల గుండె సమస్యలు, బీపీ, షుగర్ ఇంకా అలాగే థైరాయిడ్ వంటి చాలా రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.బరువుని తగ్గించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి మనం ఒక కీరదోసకాయను, ఒక ఇంచు అల్లం ముక్కను, ఒక నిమ్మకాయను ఇంకా అలాగే కొద్దిగా కొత్తిమీరను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసుకుని దానిని జార్ లోకి తీసుకోవాలి.తరువాత ఇందులో అల్లం ముక్కలను ఇంకా అలాగే కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకుని మీరు వేసుకోవాలి. ఆ తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి జ్యూస్ లాగా మెత్తగా చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ఖచ్చితంగా రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా ఈ జ్యూస్ ను తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను చాలా ఈజీగా కరిగించుకోవచ్చు. ఇంకా అలాగే అధిక పొట్ట సమస్య కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్ ను తాగిన 15 రోజుల్లో మన శరీరంలో వచ్చిన మార్పును మనం ఈజీగా గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: