పుట్నాల పప్పుని శనగలు అని కూడా అంటూ ఉంటారు. ఈ పుట్నాల పప్పును మనం స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. దీన్ని వివిధ రకాల చట్నీల తయారీలో, తీపి వంటకాల తయారీలో కూడా వాడుతూ ఉంటాము.ఈ పుట్నాల పప్పుతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. శనగల లాగే ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వేగన్ డైట్ చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఖచ్చితంగా తగినంత ప్రోటీన్ లభిస్తుంది. పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ చురుకుగా పని చేసేలా చేయడంలో సహాయపడుతుంది.ఇంకా మన ప్రేగుల కదలికలను పెంచడంలో, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పుట్నాల పప్పు మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. అందువల్ల మనం ఇతర చిరుతిళ్లను ఎక్కువగా తీసుకోము. దీంతో మనం చాలా సులభంగా బరువు కూడా తగ్గవచ్చు.


అందుకే బరువు తగ్గాలనుకునే ఆరు పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఇంకా అదే విధంగా పుట్నాల పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.ఇంకా ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇవి చాలా మేలు చేస్తాయి. ఇంకా అంతేకాకుండా పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా పుట్నాల పప్పు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది కూడా వీటిని నూనెలో వేయించి ఉప్పు, కారం చల్లి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: