చాలా చోట్ల మనం ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ తీసుకొని వచ్చేటప్పుడు ఎక్కువగా పేపర్లో చుట్టి ఇస్తూ ఉంటారు ముఖ్యంగా జంక్ ఫుడ్ వాటిని న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి ఇస్తూ ఉండడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ప్రజలు వివిధ రకాల ఆహారాలను కూడా న్యూస్ పేపర్లలో చుట్టుకొని తీసుకువస్తూ ఉంటారు.. అయితే ఇలాంటి వాటిలో చుట్టుకొచ్చినవి తినడం వల్ల ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపిస్తుందట.. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


తినేటువంటి వాటిని న్యూస్ పేపర్లో తీసుకురావడం వల్ల కొన్నిసార్లు న్యూస్ పేపర్లకు ఉండే కలర్ ఫుడ్ కు నూనె వల్ల అయ్యి వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదట.. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా పెంచుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కడుపునొప్పి అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. పిల్లలు వృద్దులు వీటిని తినకపోవడమే మంచిది.. ముఖ్యంగా న్యూస్ పేపర్లను ముద్రించడానికి ఉపయోగించేటువంటి సిరాలో హానికరమైన పదార్థాలు కూడా ఉంటాయట ఇవి మన శరీరానికి కూడా హాని కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.


నలుపు రంగులో అక్షరాలు ఉండడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తాయి.. మనం వేడి ఆహారాన్ని న్యూస్ పేపర్ లో చుట్టి తీసుకురావడం వల్ల కాలేయ క్యాన్సర్కు దారితీస్తాయట.. న్యూస్ పేపర్లలోని సిరా లోని రసాయనాలు మనం తినే టువంటి ఆహారం కలవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వస్తుందట.. ఇలా న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం సమస్యలు కూడా ఏర్పడతాయి.. అయితే వీటన్నిటికీ ముఖ్య కారణం వార్తాపత్రికలలో ప్రింట్ చేసేటప్పుడు ఉపయోగించే ఇంకులోని రసాయనాలే అన్నట్లుగా నిపుణులు తెలియజేస్తున్నారు.. ఇది ఎన్నో అనేక వ్యాధులను కూడా కారణమవుతాయని తెలియజేస్తున్నారు నిపుణులు. అందుకే న్యూస్ పేపర్లు ఎలాంటి ఆహారాలను తీసుకురాకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: