
మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని.. ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పైన గిన్నెపెట్టి అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోయాలి.. అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, రెండు అంగుళాల దాల్చిన చెక్క, రెండు యాలకులు వేసి 10 నుండి 12 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్ మీద మరిగించాలి.. ఆ తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులు వేసి మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.. కొద్దిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ సహాయంతో వడకట్టి ప్రతిరోజు ఉదయం తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది... అంతేకాదు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క్రమంగా తగ్గుతుంది.. ఫలితంగా గుండె జబ్బులు దూరం అవుతాయి..
మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేసుకోవడమే కాదు గుండె జబ్బులను కూడా దూరం చేయవచ్చు. ఇక ఊబకాయం నుంచి కూడా బయటపడతారు.. జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలు కూడా దూరం అవుతాయి . కాబట్టి ఇప్పటికే మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్లయితే ఈ డ్రింక్ ను ప్రతిరోజు తాగండి.