చాలామంది రాత్రి సమయాలలో ఎక్కువగా భోజనానికి బదులుగా చపాతి ,పూరి ఇతరత్రా వాటిని తినడానికి మక్కువ చూపుతూ ఉంటారు. ప్రతిరోజు మారిపోతున్న లైఫ్ స్టైల్ తో ఈ కాలం యువత ఎక్కువగా ఆహారం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా రెగ్యులర్ డైట్ లో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల శారీరక శ్రమ లేకుండా సరిగ్గా తిండి తినకుండా ఆరోగ్యాన్ని చాలా ప్రమాద బారిన పడేలా చేస్తున్నారని నిపుణులు సైతం ఇటీవలే ఒక పరిశోధనలో తెలియజేశారు. అయితే రాత్రి సమయాలలో భోజనానికి బదులుగా ఏవి తింటే మంచిదనే విషయం పైన చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


రాత్రిపూట అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు లేదా చపాతీలు వంటివి తినడం చాలా మంచిదట. ఎందుకంటే చపాతీలను తయారు చేసి గోధుమ పిండి లో ఎక్కువగా విటమిన్-B,E, క్యాల్షియం, జింక్ ,సోడియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటివి చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సినంత శక్తిని సైతం అందించడానికి ఉపయోగపడుతుంది. పైగా వైట్ రైస్ కంటే చపాతీలు తినడం వల్ల త్వరగా నే జీర్ణం అవుతాయి. చపాతీలను కాల్చేటప్పుడు చాలా తక్కువ నూనెనే వేసి కాలుస్తారు.


అన్నంతో పోలిస్తే క్యాలరీలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. చపాతీలు తినగానే మనకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని వల్ల బరువు కూడా కంట్రోల్ లో కలదు. అయితే రాత్రిపూట వెంటనే చపాతీలు చేసుకుని తినడం కంటే కాస్త ముందుగానే చేసుకొని తినడం వల్ల పలు రకాల లాభాలు ఉంటాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. సద్ది చపాతీలు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ తగ్గుతాయనీ.. అలాగే కడుపునొప్పి ఇతర సమస్యలు ఉండవని తెలియజేస్తున్నారు. అలాగే షుగర్ పేషెంట్లు కూడా డయాబెటిస్ కంట్రోల్ ఉంటుంది. ముఖ్యంగా పాలలో నానబెట్టిన చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి మరింత ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: