- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన చికిరి చికిరి పాట విడుదలై పది రోజులు దాటినా దాని వైబ్ మాత్రం సోషల్ మీడియాను ఇంకా వదలడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ మొత్తం ఈ పాటతోనే నిండిపోయి కనిపిస్తుంది. లక్షల్లో రీల్స్… కోట్ల వ్యూస్ ఇలా సోష‌ల్ మీడియాలో హవా చెప్పలేనిది. ఎవరూ ఊహించని విధంగా ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ఇంత భారీ చార్ట్‌బస్టర్ రావడం అభిమానులను కూడా ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. మ‌రీ ముఖ్యంగా హిందీ వెర్షన్ సాధించిన రేంజ్ నిర్మాతలు, దర్శకుడు బుచ్చిబాబుకు కూడా చాలా షాకింగ్‌గా అనిపిస్తోంద‌ట‌. ఈ పాట తెచ్చిన ఊపు మిగతా పాటలు, ట్రైలర్‌కి కూడా చేరితే నార్త్‌ మార్కెట్‌లో పిడుగు వేగంతో డిమాండ్ పెరగడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.


అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ కూడా ఉంది. చికిరి చికిరి పాట వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్న కొత్త లిరికల్ సాంగ్స్ అన్నీ కూడా దాని స్థాయిలో లేదనే భావనను ప్రేక్షకులు తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా లోని ఫ్యాన్ సాంగ్ అయినా, అఖండ 2 నుంచి వచ్చిన రెండు పాటలైనా అన్నీ కంటెంట్ పరంగా బాగున్నా, రీచ్ మాత్రం చికిరి చికిరి స్థాయిలో లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ది నుంచి ఇలాంటి బ్లాక్‌బస్టర్ సాంగ్ లేకపోయి ఉంటే, ఇవన్నీ వేగంగా పాపులర్ అయ్యేవన్న చ‌ర్చ కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.


ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓ సాంగ్ రేంజ్ కొలవాలంటే యూట్యూబ్ వ్యూస్ మాత్రమే కాదు, ఇన్‌స్టా రీల్స్ సంఖ్య కూడా ప్రధాన ప్రమాణంగా మారిపోయింది. ఇక్కడ మాత్రం చికిరి చికిరి పూర్తిగా డామినేట్ అవుతోంది. ఇంకా ఈ హీట్ చల్లారకముందే రెండో పాట రిలీజ్ చేసేందుకు టీమ్ సిద్ధమవుతోందట. అయితే శంకరవరప్రసాద్ గారు (ఏఆర్ రెహమాన్) కంటెంట్ క్లాష్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. డిసెంబర్ చివరి వారంలో రెండో సాంగ్ రిలీజ్ చేసే ఆలోచన ఉన్నా, అప్పటి విడుదల వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఏది ఏమైనా చికిరి చికిరి హ్యాంగోవర్ ఇప్పటికీ పీక్‌లోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: