అరటి ఆకులో భోజనం చేయడం అనేది మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేసే గొప్ప పద్ధతి. అరటి ఆకులో ఆహారం తినడం వల్ల కలిగే ప్రధాన లాభాలు ఏమిటో తెలుసుకుందాం.

అరటి ఆకులలో పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మనం వేడి ఆహారాన్ని ఆకులో వడ్డించినప్పుడు, ఈ పాలీఫెనాల్స్‌లో కొంత భాగం ఆహారంలో కలిసిపోయి, మనం తినే భోజనం యొక్క పోషక విలువను పెంచుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఈ ఆకులకు సహజ సిద్ధమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించి, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అరటి ఆకులలో ఉండే కొన్ని సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియ సాఫీగా జరగడానికి, పోషకాలు సరిగా శోషించబడటానికి తోడ్పడతాయి. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, చర్మానికి మెరుపుని అందిస్తాయి. అరటి ఆకులకు సహజమైన, సున్నితమైన సువాసన ఉంటుంది. వేడి ఆహారం ఆకుపై పడినప్పుడు, ఆ ఆకులోని మైనపు పూతతో కలిసి ఒక ప్రత్యేకమైన సహజ పరిమళం వస్తుంది. ఇది భోజనం యొక్క రుచిని మరింత పెంచి, మరింత కమ్మగా అనిపిస్తుంది.

అరటి ఆకులను ఉపయోగించడానికి ఎక్కువగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా నీటితో కడిగితే సరిపోతుంది. స్టీల్ లేదా ప్లాస్టిక్ ప్లేట్ల మాదిరిగా రసాయనాలు లేదా డిటర్జెంట్ల అవసరం ఉండదు, కాబట్టి ఆహారంలో ఎలాంటి రసాయనాలు కలిసే ప్రమాదం ఉండదు. ఇది భోజనానికి సురక్షితమైన ప్రత్యామ్నాయం.


ప్లాస్టిక్ లేదా థర్మోకోల్ ప్లేట్‌ల కంటే అరటి ఆకులు 100% జీవ విచ్ఛిన్నం చెందుతాయి (Biodegradable). ఉపయోగించిన తరువాత వాటిని పారవేసినా అవి త్వరగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారతాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: