గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 26వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1975 : భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాదులో ప్రారంభం.
1993: అలాన్ బోర్డర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును అధికమించాడు.

ప్ర‌ముఖుల జననాలు

1802: విక్టర్ హ్యూగో, ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త. (మ.1885)
1829: లెవీ స్ట్రాస్, బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు జననం.
1932: హేమలతా లవణం, సామాజిక సేవకురాలు జననం.
1972: శివాజీ రాజా, తెలుగు నటుడు.ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. పెళ్ళిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించాడు.

గుణ్ణం గంగరాజు నిర్మాణ సారథ్యంలో జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన అమృతం ధారావాహికలో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్రయైన అమృతం పాత్రను పోషించాడు. మాటీవీలో కొద్దికాలం పాటు సంబరాల రాంబాబు అనే ధారావాహిక ను కూడా నిర్వహించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.
1982: ఎలకా వేణుగోపాలరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు.

ప్ర‌ముఖుల  మరణాలు

1869: అఫ్జల్ ఉద్దౌలా, నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. (జ.1827)
1887: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. (జ.1865)
1908: కొడాలి లక్ష్మీనారాయణ , గ్రంథాలయ పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు. (జ.1908)
1962: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1882)
2004: శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
2019: తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు, ద్వాదశి నాగేశ్వరశాస్త్రి

మరింత సమాచారం తెలుసుకోండి: