వర్షాకాలంలో అంటువ్యాధులు బాగా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.అందుకనే పిల్లలను చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ వర్షాలు వలన దోమలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు డెంగ్యూ దోమలు బాగా ఉంటాయి.డెంగ్యూ దోమ కుడితే పిల్లలకు డెంగ్యూ జ్వరం వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.పిలల్లకు కళ్ళు నొప్పిగా ఉన్న, తల నొప్పిగా ఉన్నగాని అవి డెంగ్యూ లక్షణాలుగా గుర్తించాలి. దీనితో పాటుగా వాంతులు అవుతున్నట్లు అయితే అది మరీ ప్రమాద సూచన. ఎందుకంటే దీని కారణంగా శరీరంలోని నీటిని త్వరగా కోల్పోతారు.మీ పిల్లల శరీరం మీద అకస్మాత్తుగా పెద్దవిగా దద్దుర్లు కనిపించినట్లయితే దయచేసి వెంటనే చికిత్స కోసం డాక్టర్ ను సంప్రదించండి.కీళ్ళ నొప్పులు, శ్వాసకోస సమస్యలు, విపరీతమైన వాంతులు,అలసట మరియు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం లాంటి సమస్యలను కలిగిస్తుంది.దురదృష్టవశాత్తు పిల్లలలో డెంగ్యూ కి ప్రత్యేకమైన చికిత్స లేదు. మరియు ముందు జాగ్రత్త చర్యగా ఈ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండటమే ఏకైక మార్గము.

 

 

మీ పిల్లలకు కొబ్బరి నీరు, పండ్లరసాలు మరియు ఎక్కువ నీటితో కూడిన ద్రవపదార్థాలను ఎక్కువగా ఇవ్వండి. మీ ఇంటి ప్రాంగణంలో నీటి నిల్వలు లేకుండా చుడండి. కూలర్ ప్యాడ్స్ ను మరియు పూల కుండీలను క్రమం తప్పకుండా శుభ్రపరచండి. కృత్రిమమైన వస్తువులను, విరిగిపోయిన కప్పులను, ఫ్లాస్కులనూ ఇంట్లో నిల్వ చేయకండి. నీటితో నింపిన బకెట్ లను మూసి ఉంచండి. పక్షులకు ప్రతి రోజు శుభ్రంగా స్నానం చేయించండి. మొక్కలకు తగినంత నీటిని మాత్రమే పోయండి. కుండీలను శుభ్రంగా ఉంచుకోండి.పగటి వేళల్లో ఈ డెంగ్యూ దోమలు ఎక్కువగా ఉంటాయి.

 

 

 

అందుకే పిల్లలను పగటి వేళల్లో బాగా కప్పి ఉంచండి. మీ చిన్నారులకు ఫుల్ గా ఉండే ప్యాంట్లు, సాక్సులు ,పొడవు చేతులు టీ షర్ట్ లు మరియు టాప్స్ ఉపయోగించండి.ఇంటిలో మూలలలో గానీ, పై భాగంలో గాని ఎక్కడ గుంటలు లేకుండా చూసుకోండి. ఆ ప్రాంతాలలో తడిలేకుండా పొడిగా ఉంచండి. చెత్త బుట్టలను ఎప్పుడూ మూసి ఉంచండి. మరియు చెత్తను తరచుగా తీసివేస్తూ ఉండండి. దోమల నివారణ కోసం మీరు కర్పూరంను ఇంటిలో మండించవచ్చు లేదా యూకలిప్టస్ ఆయిల్ మరియు లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా ఉపయోగించి మీ ఇంటిలోనికి దోమలు రాకుండా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: