దేవుడికి కోపం రావడం వల్ల ఆకాశంలో మెరుపులు ఏర్పడతాయి అన్న ప్రజల మూఢనమ్మకాన్ని పటాపంచలు చేశాడు బెంజెమిన్ ఫ్రాంక్లిన్. మేఘాల మధ్య ఏర్పడే ఘర్షణ వల్ల మెరుపులు ఏర్పడతాయని నిరూపించాడు. అంతేకాదు పిడుగుల నుంచి మనల్ని రక్షించుకోడానికి లైటింగ్ అరెస్టర్ ను కూడా కనిపెట్టాడు. ఇంత గొప్ప శాస్త్రవేత్త అయిన బెంజెమిన్ స్కూల్, కాలేజ్, యూనివర్శిటీలకు వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా ... అయితే, ఇది నిజం. శాస్త్రవేత్త అంటే బాగా పెద్ద పెద్ద స్కూళ్ళలో పెద్ద పెద్ద చదువులు చదివారు అనుకుంటాం కదా. మరి బెంజెమిన్ మాత్రం స్కూలుకు, కాలేజ్ కూ వెళ్ళకుండానే పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. అమెరికాలోని బోస్టన్ లో 1706 జనవరి 17న పుట్టాడు. వారు మొత్తం పదిహేడు మంది పిల్లలు. అంతమంది పిల్లల్ని పోషించలేక బెంజెమిన్ తండ్రి అతన్ని చిన్నప్పుడే కొవ్వొత్తుల తయారు చేసే ఫాక్ట్యరీలో పనికి పెట్టాడు. ఆ తర్వాత ఒక ముద్రణ సంస్థలో పనిచేశాడు.అక్కడ బెంజెమిన్ సొంతంగా చదువుకోడం మొదలు పెట్టాడు. ముప్పయి ఎనిమిదేళ్ళ వయసులో ప్రయోగాల కోసం పరికరాలను కొనడం మొదలు పెట్టాడు. అలా సొంతంగా ప్రయోగాలు చేసి బైఫోకల్ అద్దాలు, క్యారేజ్ ఒడోమీడర్, గ్లాస్ అర్మొనికా, ఫ్రాంక్లిన్ స్టవ్ లాంటి ఎన్నో పరికరాలు కనిపెట్టాడు. ఆయన చదువుకోలేదు కనుక తనలాగా ఎవ్వరూ డబ్బులు లేక చదువుమానకూడదని విద్యా అకాడమీని కూడా స్ధాపించాడు. ఆ అకాడమీ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: