పాప్ కార్న్ ని తెలుగులో మొక్క జొన్న పేలాలు అని పిలుస్తారు. వాటిని సినిమా థియేటర్లలో కూర్చొని తింటుంటారు ప్రజలు. అయితే, పేలాల తినడానికి, ప్రాణహానికి సంబంధమేంటి? పేలాలు తిని ఒక వ్యక్తి గుండె జబ్బు బారిన ఎలా పడ్డాడనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


సెప్టెంబర్ నెలలో ఒకరోజు ఆడమ్ మార్టిన్ అనే 41ఏళ్ల బ్రిటిష్ వ్యక్తి మొక్కజొన్న పేలాలు తిన్నాడు. అయితే, ఒక పాప్ కార్న్ ముక్క అతడి నోట్లోని ఒక పంటి కింద ఇరక్కుపోయింది. దాంతో, మార్టిన్ బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అనేకరకాల పరికరాలను పంటి కిందకి దూర్చి ఆ ముక్కని లాగేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. ఒక అగ్నిమాపక అధికారైనా ఇతడు ఒక పెన్, వైర్, నట్టు ఇంకా అతడికి దొరికిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకొని పాప్ కార్న్ ముక్కని బయటకి తీసేందుకు ట్రై చేశాడు. అయితే, ఈ క్రమంలోనే అతడి పంటి చిగుళ్లుకు బాగా గాయలయ్యి రక్తస్రావం జరిగింది. ఆ తరువాత అతడి చిగుళ్లకు ఇన్ఫెక్షన్ సోకింది.


ఈ చిగుళ్ల సంక్రమణ రక్తనాళాల ద్వారా మెలమెల్లగా శరీరా భాగాలకు చేరి చివరికి గుండె ఇన్ఫెక్షన్ కు దారితీసి హృదయ లోపల పొరలోని శోధమును పాడుచేసింది. అప్పటినుండి మార్టిన్ కి రాత్రి వేళల్లో బాగా చమట పోసేది, రోజంతా నీరసంగా ఉండేవాడు, భరించలేని తలనొప్పివచ్చేది. అక్టోబర్ నెల వచ్చిన కూడా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దాంతో, ఒక ఆసుపత్రి కి వెళ్లి వైద్య పరీక్షలను చేయించుకున్నాడు. అక్కడి డాక్టర్లు పరీక్ష చేసి.. 'నీకు ఒక ఇన్ఫెక్షన్ కారణంగా గుండె పూర్తిగా పాడైపోయింది. అది కూడా మీ చిగుళ్ల నుండి సంక్రమించింది' అని చెప్పగా మార్టిన్ షాక్ అయ్యాడు. అతను తేరుకున్న తరువాత ఒక మంచి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. అయితే, మార్టిన్ లోని ఎడమజఠరిక.. కుడి ఎడమ కర్ణికకు మధ్య నుండు ద్విపత్రకవాటమును బాగుచేసి, బృహద్దమని మొదటి కవాటమును తొలగించి కొత్త కవాటమును అమర్చారు వైద్యలు. దీంతో, అతను ప్రాణాలతో బయటపడగలిగాడు. కేవలం పేలాలు తిని ప్రాణం మీదకి తెచ్చుకున్న వ్యక్తిగా ఇతడు వైద్య చరిత్రలో రికార్డులకెక్కాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: