ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగిపోతుంది. కన్నడ నటుడిగా దర్శకుడిగా ఆయన చూపించిన ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ వ్యక్తిని ఇప్పుడు తెలుగు జనాలు దేవుడిలా ఆరాధిస్తున్నారు. ఆయన చేసిన సినిమాల కాన్సెప్ట్, ఆయన చూపించిన విజన్, ఆయన కష్టపడి తీసిన ప్రతి సీన్ — అన్నీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.


‘కాంతార: చాప్టర్ 1’ అనే సినిమాతో రిషబ్ శెట్టి మళ్లీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మొదటి రోజునుండే ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరికీ ఆయన ప్యాషన్, డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. నటుడిగా, దర్శకుడిగా, టెక్నీషియన్‌గా ఆయన ఈ సినిమాను దగ్గరుండి నడిపించిన తీరు చూసి ఇండస్ట్రీలో ఉన్నవాళ్లంతా ఇంప్రెస్ కాకుండా ఉండలేకపోతున్నారు.



ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — రిషబ్ శెట్టి విజయం కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఒక దేవుడి కాన్సెప్ట్‌తో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి తరహాలో, అలాంటి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను తెలుగులో చేస్తే బాగుంటుందన్నది అభిమానుల అభిప్రాయం. సోషల్ మీడియాలో “ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా రికార్డులు బద్దలుకొడతాడు” అన్న కామెంట్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి.ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో "మురుగన్" సినిమా అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తయ్యాయని, ఎన్టీఆర్ కూడా ఈ సబ్జెక్ట్‌పై చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మురుగన్ జీవిత కధ  కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కబోతుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ వార్తలు నిజమైతే, రిషబ్ శెట్టి ‘కాంతార’ లెవెల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక కల్ట్ క్లాస్ హిట్ కొట్టబోతున్నాడని అభిమానులు నమ్ముతున్నారు.



ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం బాగోలేని కారణంగా కొంతకాలం రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఆ విరామం తర్వాత ఆయన మళ్లీ ఫుల్ జోష్‌తో ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. మొదటగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ‘డ్రాగన్’ సినిమా షూట్‌లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత దేవర 2..ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు.ఇక అభిమానుల అంచనాలు అయితే అతి పెద్ద స్థాయిలో ఉన్నాయి. “రిషబ్ శెట్టి ‘కాంతార’ తర్వాత ఆ లెవెల్లో హిట్ కొట్టబోయేది మన ఎన్టీఆర్ మాత్రమే” అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: