ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ప్రేక్షకులను ఆకర్షించడానికి తప్పనిసరిగా రొమాంటిక్ సీన్లు, బీప్ సౌండ్స్‌, లేదా వల్గర్ కంటెంట్‌ అవసరమని చాలా మంది ఫిల్మ్‌మేకర్లు భావించేవారు. కానీ ఈ తరం డైరెక్టర్లు మాత్రం ఆ ఆలోచనను పూర్తిగా తిప్పికొడుతున్నారు. ఇప్పుడు వారు చూపిస్తున్న దిశ ఏంటంటే — “మంచి కథ, మంచి కాన్సెప్ట్, ప్యూర్ ఎమోషన్ ఉంటే చాలు... సినిమాలు బీప్ లేకుండా, ముద్దు సీన్స్ లేకపోయినా హిట్ అవుతాయి” అనేది. ఇదే విషయాన్ని స్పష్టంగా రుజువు చేసిన తాజా ఉదాహరణ “కాంతార చాప్టర్ 1” సినిమా. కన్నడ స్టార్ డైరెక్టర్, నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఏ ఒక్క వల్గర్ సీన్ లేకుండా ప్రేక్షకులను థియేటర్‌లకు దరికి ఎక్కించింది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా భక్తి, దేవుడు, మనసుకు తాకే విలువలు, మరియు గ్రామీణ సాంస్కృతిక స్పూర్తితో ముందుకు సాగుతుంది.


రిషబ్ శెట్టి నటన, ఆయన డైరెక్షన్‌, అలాగే హీరోయిన్ రుక్మిణి వసంత్ అందాలు, న్యాచురల్ పెర్ఫార్మెన్స్‌ — ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. ప్రేక్షకులు ఈ సినిమా మీద చూపిన ప్రేమ అంతగా ఉందంటే, విడుదలైన కొద్దికాలంలోనే “కాంతార చాప్టర్ 1” 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది.ముఖ్యంగా ఈ సినిమా చూపించిన దేవుడు కాన్సెప్ట్‌, రా ఎమోషన్స్‌, హృదయానికి తాకే సంగీతం, సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. రిషబ్ శెట్టి తన గత చిత్రం “మహావతార నరసింహ” ద్వారా ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు “కాంతార చాప్టర్ 1”తో మరోసారి అదే మ్యాజిక్‌ క్రియేట్ చేశారు.



దీనితో సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక్కటే చర్చ — “ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతోంది.” అని. ఇప్పుడు డైరెక్టర్లు, రచయితలు అందరూ ఒకే మాట చెబుతున్నారు . “ప్రేక్షకులు వల్గర్ సీన్స్‌ కోసం కాదు, మంచి కంటెంట్‌ కోసం థియేటర్‌కు వస్తున్నారు. రొమాంటిక్ సీన్స్‌, సెక్స్‌ సీన్స్‌ లేకపోయినా కథ బలంగా, కాన్సెప్ట్ అద్భుతంగా ఉంటే జనాలు ఆ సినిమాను ప్రేమిస్తారు.”ఇది చూసి చాలా మంది ఫిల్మ్‌మేకర్లు కూడా ప్రేరణ పొందుతున్నారు. జెన్యూన్ కంటెంట్‌ ఉన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ అవుతాయని ఇప్పుడు అందరూ నమ్మకం పెంచుకున్నారు. కాంతార లాంటి సినిమాలు చూపిస్తున్నాయి — హార్ట్ టచ్ అయ్యే కథ, పాజిటివ్ ఎనర్జీ, సాంస్కృతిక విలువలు ఉంటే ప్రేక్షకుల మనసుల్లో ఆ సినిమా చిరస్థాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇకముందు ఇండస్ట్రీలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగనుంది — సినిమా హిట్ కావాలంటే కంటెంట్‌ హిట్ కావాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: