మనుషులు ఏం చేసినా తమ ఆనందం కోసమే చేస్తారు.. ఆనందంగా బతకడం కోసమే రోజంతా కష్టపడతారు. ఆనందంగా ఉండాలనే గొడ్డు చాకిరీ చేస్తారు. అయితే ఈ క్రమంలో అసలు ఆనందం అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. విశ్వంలోని మిగిలిన ప్రాణులకూ మనిషికీ ఉన్న తేడా ఆలోచించే తత్వమే.

 

 

కానీ తాపత్రయంలో పడి అసలు ఆ ఆలోచన, విచక్షణే మరుస్తున్నారు. ఆనందంలో పుట్టి, ఆనందంలో బతికి, ఆనందంలోనే లయం కావాల్సింది మానవ జీవితం. తనతోపాటు నిత్యమూ ఉండే వస్తువుపై ఎరుక కలగడమే ఆనందం. ఆ ఆనందం తనకు సహజమైనది, చైతన్యవంతమైనది. అదే సత్యం కూడా.



 

అసలైన ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలో ఉంది. ఇదే అసలు రహస్యం. తనను తాను మరచి ఇతరుల సంతోషం గురించి నిత్యం ఆలోచించడంలో నిజమైన ఆనందం ఉంది. ఇదే ఆనందసృష్టికి కీలకం. కానీ ఈ రహస్యం మాత్రం ఎవరూ గుర్తించడం లేదు.

 

 

మనం ఆనందం అనుకుంటున్న మిగిలిన ఆనందాలు దీని కంటే ఎక్కువ తృప్తి ఇవ్వలేవు. ఆనందంగా బతకడం రాకపోతే మనిషికి సాటి జీవులతో కలిసిమెలిసి ఉండే అవకాశం దొరకదు. ఆనందంతోనే అతడు ప్రకృతికి దగ్గర కాగలడు. ఆనందాన్ని ఇతరులకు పంచి చూడండి.. ఎంత ఆనందం అనుభవిస్తారో మీకే తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: