మామిడి పండ్లు.. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ముఖ్యంగా వేస‌వి కాలం వ‌చ్చిందంటే చాలు.. ఎక్క‌డ చూసినా మామిడి పండ్లే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.  బంగినపల్లి మామిడి కాయైనా, నూజివీడు రసాలైనా, ఇలా రకాలు ఏవైనా.. వాటి రుచి మాట‌ల్లో చెప్ప‌లేనిది. అందుకే భారతదేశంలో మామిడిపండును పండ్లలోనే రాజుగా పిలుస్తారు. వేసవి వేడిని మరచిపోయేలా మామిడి మైమరపించివేస్తుంది. ఇక మామిడి పండ్ల ద్వారా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. సాధార‌ణంగా మామిడి కాయ‌ ధ‌ర ఎంత ఉంటుంది.. మ‌హా అయితే ప‌ది నుంచి వంద దాకా ఉంటుంది. కానీ, ఒక్క మామిడి కాయ ఐదు వేల‌కు కూడా అమ్ముతారు.

IHG

అవును! మీరు విన్న‌ది నిజ‌మే. జపాన్‌లో పండించే మామిడి పండ్ల‌ను రేట్లు.. మ‌న‌కు దిమ్మ‌తిరిగేలా చేస్తుంది. ఇక్క‌డ మాత్రమే కనిపించే అరుదైన మామిడి రకం మియజాకీ మామిడి పండు. ఈ మామిడి పండు రేటు వందో రెండొంద‌లో కాదు.. ఏకంగా నాలుగు వేల నుంచి ఐదు వేల వ‌ర‌కు ఉంటుంది. ఎందుకంటే.. ఈ మామిడి పండు మన వద్ద ఉండే మామిడి పండుతో పోల్చితే 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉండటంతో పాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంద‌ట‌.

IHG's Most Expensive Mango - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EGG' target='_blank' title='egg-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>egg</a> Of The Sun- <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> Viral <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> ...

ఇక మ‌రో విచిత్రం ఏంటంటే.. ఈ మామిడి పండ్లను తోటల్లో కాకుండా కుండీల్లో పెంచుతారు. ఇవి మొక్కలుగా ఉన్న సమయంలోనే కాయలను కాస్తుంది. అలా కాసిన కాయలు చాలా జాగ్రత్తగా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్క‌డ ఒక్క మామిడి కాయ రేటు అధికంగా ఉంటుంది. క‌నీం కేజీ కూడా ఉండని మామిడి కాయ ఐదు వేల రూపాయలు ఉండటం అంటే ఆ పండు విశిష్టత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎలాంటి విష ప్రయోగాలు ఆ మామిడిపై జరగవు, పూర్తిగా శాస్త్రీయ పద్దతిలో.. కాలుష్యంకు దూరంగా ఆ మామిడి మొక్కలను పెంచి.. మామిడి పండ్ల‌ను కాయిస్తారు. ఇలాంటి అరుదైన‌, అతి ఖ‌రీదైన‌ మామిడి పండ్ల‌ను జపాన్‌ నుండి అనేక‌ దేశాలకు కూడా రవాణా చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: