తోటకూర.. ఈ ఆకు కూరలు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎన్నో పోషకాలు దాగివున్నాయి. ఎన్నో రోగాలను నయం చేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా తోట కూరను ఎక్కువగా తీసుకోమని చెప్తుంటారు. అయితే తోట కూరతో కొంత మంది పప్పు లేదా కూరను చేసుకుంటారు. కానీ కొంత మంది ఆకు కూరలతో వెరైటీ గా చేసుకోవాలని భావిస్తారు. అలాంటి వాళ్ళు తోట కూర తో వడలను చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తారు.. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం... 


కావలసిన పదార్థాలు.. 

మినుప పప్పు : అర కిలో, 

తోటకూర: రెండు కట్టలు, 

కొత్తిమీర: ఒక కట్ట, 

ఉల్లి పాయలు: రెండు, 

జీలకర్ర: ఒక స్పూన్‌, 

పచ్చి మిర్చి: రెండు,

 ఉప్పు: తగినంత, 
 .
 నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం: 


మినుప పప్పును ముందు రోజు రాత్రి నాన బెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మినుప పప్పును నీళ్ళు లేకుండా గట్టిగా, మెత్తగా గారెలు పిండిలాగా రుబ్బుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమం లో తరిగి పెట్టుకున్న కొత్తి మీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోట కూరను కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుకోవాలి. అందులో ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లా వత్తుకుని నూనె లో వేయించుకుంటే సరి. రుచికరమైన తోటకూర వడలు రెడీ.. టమోటా చట్నీతో లేదా పల్లీల చట్నీతో కలిపి తీసుకుంటే ఇంకాస్త రుచిగా ఉంటాయి. తోట కూరను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోవడం చాలా మంచిది. అసలు తోటకూర తో చేసినట్లు తెలియదు. అందుకే చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు.  తోట కూర తో ఈ వడలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: