
పల్లీలు తినడం వల్ల శరీరంలో సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.వేరుశెనగలోని అన్ శాచురేటెడ్ ఫ్యాట్ మీ గుండెను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. హార్ట్ స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది.అలాగే వేరుశనగలో ఉన్న క్యాల్షియం ఎముకలు, కండరాలను గట్టి పరుస్తుంది. వారంలో కనీసం మూడు సార్లు వేరు శనగను ఆహారంలో తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు రావని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.బి, సి, ఇ తో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లూ ఐరన్, కాల్షియం, జింక్, బోరాన్... వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. అదే విధంగా, పల్లీల్లోని ప్రత్యేక పోషకాలు శరీరంలోని చెడు కొవ్వుని తగ్గించి.. మంచి కొవ్వుని పెంచుతాయి. దీని వల్ల బరువు తగ్గాలనే కునేవారికి మేలు జరుగుతుంది. అందుకే పల్లీలు రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లంతో కలిపి ఉండలు చేసుకుని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.అలాగే పల్లీలు నానబెట్టి ప్రతిరోజు కొంచెం తీసుకోవడం వలన గ్యాస్ సమస్యను ఎదుర్కోవచ్చు.