హిందువులు గ్రాండ్ గా జరుపుకొనే పండుగలలో ముఖ్యమైన పండుగ దీపావళి కూడా ఒకటి. చెడుపై విజయాన్ని సాధించడం కోసం ఈ పండుగని చేసుకుంటూ ఉంటారు ప్రజలు. అలాగే పండుగ రోజున నెగిటివ్ ఎనర్జీ ని తొలగించి, పాజిటివ్ ఎనర్జీ ని పెంచుకోవడం కోసం ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. అయితే వాస్తు ప్రకారం దీపావళి పండుగను ఎలా చేయాలి..? లక్ష్మీ దేవిని ఎలా పూజించాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దీపావళికి రెండు రోజులు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. అందువల్లే ఇంటిని ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకుంటారు. ముఖ్యంగా ఇంటిలో ఉండేటువంటి పాత వస్తువులను బయటికి పారవేయాలి. ఇలాంటివి చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటికి బాగా అనుకూలిస్తుంది.

దీపావళి అంటేనే లక్ష్మీదేవి పూజకు చాలా అనువైన రోజు. ఇక ఈ పూజ చేసిన ఇంట్లో సంపద, అదృష్టం లక్ష్మీదేవి రూపంలో వారి ఇంటికి చేరుతాయి. అందుకోసం మనం సరైన స్థలంలో లక్ష్మి పూజను చేయవలెను. ఇక దీపావళి రోజున  సాయంత్రం వేళ 6:32 నుంచి 8:21 వరకు లక్ష్మీ పూజకు బాగా అనువైన గంటలు అని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవి బొమ్మను ఉత్తరముఖంగా ఉంచాలట. ఇక ఆ బొమ్మ ముందు ఎంతో విలువైన వస్తువులను పెట్టి పూజించడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి అని పండితులు తెలియజేస్తున్నారు.

దీపావళి రోజున పూజ గదిలో దీపారాధన చేయాలి. ముఖ్యంగా తులసి కోట దగ్గర కూడా దీపాలను ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా నీటి నుంచి వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చు. ముఖ్యంగా దీపాలు వెలిగించేటప్పుడు ఇత్తడి వస్తువులను వాడటం చాలా మంచిది. ఇవి ఉపయోగించుకోవడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి.

మట్టి ప్రమిదలు కూడా మంచిని చెక్కుచెదరకుండా ఉంచుతాయి.. ఒకసారి మీరు ఇత్తడి ప్రమిదలు కొనుగోలు చేస్తే, ఇక ప్రతి సంవత్సరం వాటిని ఉపయోగించవచ్చు ..మట్టి ప్రమిదలు అయితే ప్రతి సంవత్సరం కొత్తవి తీసుకోవాల్సి ఉంటుంది.. అంతే కాదు ఇవి పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: