మనం కొన్ని ఇళ్లను చూస్తే.. చాలా బాగున్నప్పటికీ.. ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు ఆ ఇంటి కుటుంబ సభ్యులు. సాధారణంగా మనం పీల్చే గాలిలో పాజిటివ్ ఎనర్జీ , నెగటివ్ ఎనర్జీ కచ్చితంగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందొ ఆ ఇల్లు ఎంత చక్కగా ఉన్నప్పటికీ ఇంట్లో కలతలు మాత్రం తగ్గిపోవట. అలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడంవల్ల ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలా ఉండడమే కాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే మనలో చాలా మంది ఇళ్లు కట్టుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఏ పనులు చేయాలో అన్నీ కూడా చేస్తూ ఉంటారు.

ఇకపోతే భారతీయ వేదాలలో వాస్తుశాస్త్రం అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇంట్లో ఆనందం, శాంతి ,ఆరోగ్యం ,ఐశ్వర్యం వంటివి రావాలి అంటే తప్పకుండా కొన్ని వాస్తు సూత్రాలు పాటించి తీరాలి. తద్వారా ఇంట్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో కి వచ్చే మెయిన్ డోర్ చాలా శుభ్రంగా ఉండాలి . ఎప్పుడు క్లీన్ గా ఉండేలా నిరంతరం చూసుకుంటూ మనం జాగ్రత్త వహించాలి. విండ్ చిమ్స్ అనేవి చిన్న గాలి వచ్చినా అటూ ఇటూ కదులుతూ ఉంటాయి. కాబట్టి మంచి శబ్దాలు చేస్తాయి. ఈ శబ్దాలు నెగటివ్ ఎనర్జీ ని ఆపి వేస్తాయి. బయట నుంచి ఇంట్లోకి గాలి వచ్చే చోట ఈ విండ్ చిమ్స్ ను ఏర్పాటు చేయండి.

ఇక ఉప్పు చాలా పవర్ఫుల్ అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ ఉప్పుకు  నెగిటివ్ ఎనర్జీని పీల్చే శక్తి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒక గిన్నెలో గుప్పెడు ఉప్పు వేసి గదిలో ఒక మూల ఉంచడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: