ఈ మధ్యకాలంలో కొత్తగా ఇంటిని నిర్మించుకునే ప్రతి ఒక్కరి వంటింట్లో ఈ సింక్ చాలా ప్రాధాన్యత వహిస్తుంది.. ఇంట్లో తిన్న తర్వాత కంచాలను, గిన్నెలను శుభ్రం చేయడానికి .. వంట చేసేటప్పుడు కూరగాయలు కడగడానికి.. చేతులు శుభ్రం చేసుకోవడానికి ఇలా ప్రతి చిన్న పనికి మనం సింక్ ను ఉపయోగిస్తాము . ఇకపోతే చాలావరకు స్టీల్ సింక్ ని ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే వీటిని సరైన విధానంలో శుభ్రం చేయక పోయినా, వాడకపోయినా మొత్తం వంటగది రూపాన్ని మార్చేస్తాయి.. అందుకే సింకు ను ఎప్పటికప్పుడు కొత్త దానిలా తళ తళ మెరిసి పోతూ ఉండేలా చూసుకోవాలి..
సింక్ ను ఎలా శుభ్రం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ను ఇంట్లో ఉపయోగిస్తారు కాబట్టి వాటిని శుభ్రం చేయడానికి రసాయనాలు కలిగిన లిక్విడ్ ను , గరుకుగా ఉన్న స్క్రబ్ ను ఉపయోగిస్తారు.. వీటిని ఉపయోగించడం వల్ల సింకు మీద గీతలు పడిపోయి కొద్దిరోజుల్లోనే పాత పడిపోయినట్లు అయిపోతుంది. అందుకే సింక్ ను శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. సింకులు శుభ్రం చేయాలి అంటే బేకింగ్ సోడా, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ లేదా నారింజ తొక్కలను ఉపయోగించి సింకు ను శుభ్రంగా క్లీన్ చేయవచ్చు.
ముందుగా సింకులో ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి..ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసి ఆ తర్వాత వెనిగర్ తో కడిగితే మెరిసిపోయే సింక్ మీ సొంతమవుతుంది. ఒకవేళ దుర్వాసన వస్తూ ఉన్నట్లయితే నిమ్మరసం లేదా నారింజ తొక్కల తో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది. ఎప్పటికప్పుడు వేడినీళ్లలో మైల్డ్ సోపు వేసి శుభ్రం చేయాలి. ఇక అంతే కాదు వైట్ వెనిగర్ ఒక వస్త్రం పై వేసి సింక్ పై ఉన్న నీటిని తుడవడం వల్ల తుప్పు పడుతుంది అనే సమస్య కూడా ఉండదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సింక్ తళతళా మెరిసిపోతూ ఉంటుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి