ఒక గుప్పెడు పచ్చి పెసర్లను పాలల్లో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా రుబ్బుకుని ఆ పేస్టును ముఖం, చేతులు, కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఇక 20 నుంచి 30 నిమిషాలు ఆగిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం , కాళ్లు, చేతులు మెరిసి పోవడమే కాకుండా తాజాగా కూడా ఉంటాయి.
మీకు మొటిమలు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నట్లు అయితే ఇందుకోసం పచ్చి పెసర్లను పాలలో నానబెట్టి బాగా రుబ్బి ఈ పేస్ట్ లో కొద్దిగా తేనె కలపాలి. పది నిమిషాలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం మీద ఉండే మొటిమలు తొలగిపోతాయి.
ముఖం మీద ట్యాన్ , నలుపుదనం వచ్చినట్లయితే.. పెసర్లు నీటిలో బాగా నానబెట్టి.. వాటిని రుబ్బి అందులోకి చల్లటి పెరుగు, కీరదోస వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మీద వచ్చే ట్యా న్, నల్లటి మచ్చలు ఇలా అన్నీ కూడా దూరం అవుతాయి.
చుండ్రు సమస్య ఎక్కువ అయితే పెసరపిండి తీసుకొని.. అందు లోకి పెరుగు, నిమ్మరసం , గుడ్డులోని తెల్లసొన అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు జుట్టు కుదుళ్ళకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు దూరమవుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి