కరోనా వల్ల ఎంతో మంది జీవితాలు చిందర వందర అయ్యాయి. అయితే ఇప్పటికి ఆరోగ్య సమస్యల బారిన పడుతూనే ఉన్నారు ప్రజలు. అయితే కరోనా మరొక వేవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుచేతనే మనం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా గుండె సమస్యలకు సంబంధించి, మధుమేహ సమస్యల వాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇతర రోగాల సైతం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపునొప్పి వల్ల కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


కల్తీ ఆహారం తినడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి , సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కడుపు నొప్పి సమస్యలు వస్తాయట. అయితే శరీరం చలికి గురికావడం వల్ల ఇలాంటి కారణాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి తరగడంతో పాటు అలసట,  నీరసం వంటివి కూడా వస్తూ ఉంటాయి. దీంతో హఠాత్తుగా కడుపు నొప్పి వచ్చిన ఇలాంటి సమయంలో కొన్ని ఇంటి నివారణ పద్ధతులను అనుసరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

1).లెమన్ జ్యూస్ తరచు తాగడం వల్ల ఇలాంటి కడుపు నొప్పి సమస్య నుండి విముక్తి పొందవచ్చు. లెమన్ జ్యూస్ ని గోరువెచ్చని నీటితో కాంబినేషన్లో కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు.

2).ఇక మరొక టిప్ ఏమిటంటే ఒక గ్లాసుడు వేడి నీటిని తీసుకొని అందులో కి కాస్త నిమ్మరసాన్ని కలిపి తేనెను మిక్స్ చేసి బాగా కలిపి తాగినట్లయితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

3). ఇక మరొకటి ఏమిటంటే పుదీనా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి.. ఆ ఆకులను నోట్లోకి వేసుకొని బాగా నమిలి ఆ రసాన్ని మింగితే అప్పుడు కడుపు నొప్పి తగ్గుతుందట.

4). ఒకవేళ పుదీనా ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కడుపు నొప్పి కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: