వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద.. ఎండాకాలం వచ్చిందంటే ఈగల బెడద ఒక చోట కుదురుగా కూర్చొనివ్వవు. ఇక వీటివల్ల అనారోగ్యాలే కాదు మన మైండ్ సెట్ కూడా మారుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈగలను చూసినా చాలామందికి నచ్చదనే చెప్పాలి. వీటివల్ల ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈగల వల్ల అనారోగ్య సమస్యలతో పాటు మరికొంతమందికి చర్మ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయని వైద్యుల హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే దోమల లాగా మనుషులను ఈగలు కుట్టవు కానీ ఇవి వాలిన ఆహార పదార్థాలను తింటే టైఫాయిడ్,  విరోచనాలు,  డయేరియా,  కలరా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యాధికారకాలైన ఈగలను ఎలా ఇంటి నుంచి తరిమికొట్టాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఈగల గుంపు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలి అంటే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును గ్లాస్ నీటిలో వేసి ఇంటి మొత్తం పిచికారి చేయాలి. ఇలా చేస్తే ఈగలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి.

కర్పూరం కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కర్పూరం వెలిగించి ఆ పొగ ఇంటి మొత్తం వ్యాపించేలా చేస్తే ఈగలు వెంటనే పారిపోతాయి.

అంతేకాదు కర్పూరం బిళ్ళలను పొడిచేసి. నీటిలో కలిపి ఆ నీటిని ఇంటి అంతా చల్లినా సరే ఈగలు ఆ వాసనకు వెళ్లిపోతాయి. అంతేకాదు ప్రతి మూలల్లో కూడా కర్పూరం ఉంచడం వల్ల వాసనకు తట్టుకోలేక ఈగలు ఇంట్లోకి రావు.

ఒక గ్లాసు పాలలో టేబుల్స్పూన్ నల్లమిరియాల పొడి మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి ఈగలు ఉన్నచోట ఈ పాలను చల్లితే వెంటనే ఈగలు చచ్చిపోతాయి.

అలాగే ఇంటి ఆవరణలో మొక్కలను పెంచితే వీటి వాసనకు ఈగలు పారిపోతాయని చెప్పవచ్చు. లేదా తులసి , పుదీనా ఆకులను గ్రైండ్ చేసి ఇంటి చుట్టూ లేదా ఇంటి లోపల స్ప్రే చేసినట్లయితే ఈగల బెడద తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: