ఉసిరికాయ:
ఉసిరికాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి వ్యాధులతో పోరాడడానికి సహాయపడే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇందులో నారింజ కంటే 18 రెట్లు ఎక్కువ విటమిన్ సీ.. దానిమ్మ పండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది తలకు రక్తప్రసరణ పెంచడం ద్వారా జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. థైరాయిడ్ రోగులకు ఉసిరి చాలా ప్రయోజన కారి అని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి:
కొబ్బరిని పచ్చిగా లేదా ఉడికించి తినడం వల్ల థైరాయిడ్ రోగులకు అద్భుతమైన ఆహారం కాబట్టి .. దీనిని తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా పచ్చి కొబ్బరిలో MCFA, MTC లు ఎక్కువగా రెండూ వుంటాయి.ఇవి జీవక్రియలో ఎక్కువగా సహాయపడతాయి.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడి గింజలలో జింకు పుష్కలంగా ఉంటుంది. శరీరం ఇతర విటమిన్లు, ఖనిజాలు గ్రహించడం , థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, సమతుల్యత కోసం ఇది చాలా అవసరం.
బ్రెజిల్ గింజలు:
సెలీనియం థైరాయిడ్ హార్మోన్ జీవక్రియకు అవసరమైన సూక్ష్మ పోషకం . రోజుకు మూడు బ్రెజిల్ గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ థైరాయిడ్ ఖనిజం లభిస్తుంది.
పెసలు:
ఇందులో ప్రోటీన్లు , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని కావాల్సిన అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడే వారికి కూడా మంచి ప్రయోజన కారిగా ఉంటుంది.