ఇప్పుడున్న పొల్యూషన్, ఆహార అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.అందులో ముఖ్యంగా జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. దీనిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఆయిల్స్, షాంపూలు మార్చి, మార్చి వాడుతుంటాము. వాటితో ఎలాంటి ఫలితం దక్కక పోగా, మరిన్ని జుట్టు సమస్యలు అవరించేలా చేస్తున్నాయి. విటన్నిటికీ మన అమ్మమ్మల నాటి చిట్కాలే చక్కటి పరిష్కారం చూపుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కా వల్ల ఎలాంటి జుట్టు సమస్యకైనా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

 జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో గంజి నీళ్లు చాలా బాగా సహాయ ప‌డ‌తాయ‌ని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ అన్నం గంజిలో జుట్టు దృఢంగా ఉండడానికి దోహదపడే ఇనోసిటాల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం పుష్కళంగా ఉంటుంది. దీనిని జుట్టుకు వాడటం వల్ల, జుట్టు రాలే సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు.మన అమ్మమ్మల నాటి కాలంలో అన్నాన్ని గంజి వార్చి, ఆ గంజిని తాగేవారు. ఇలా అన్నం వార్చ‌గా వ‌చ్చిన గంజి పడేయకుండా వారు తీసుకోవడం వల్ల అందులోని న్యూట్రియంట్స్ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడేవి.

జుట్టు సమస్యకు గంజి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
అన్నం ఊడికిన తర్వాత గంజిని ఒక శుభ్రమైన గిన్నెలోకి వార్చుకోవాలి. అది కొంచెం చల్లబడి, గోరువెచ్చగా వున్నప్పుడే,జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు అప్లై చేసి మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత దీనిని ఒక గంట పాటు ఆరనివ్వాలి. ఒక గంట త‌రువాత మైల్డ్ షాంపుతో శుభ్రం చేసి, కండిషనర్ రాయాలి. ఇలా వారానికి ఒకసారి చేయ‌డం వ‌ల్ల జుట్టు ధృడంగా, మెరుస్తూ పట్టు కుచ్చులా త‌యార‌వుతుంది. అంతేకాక ఇతర జుట్టు సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి చిన్న,చిన్న చిట్కాలతో పాటు, జుట్టు పెరుగుదలకు సహాయపడే 'విటమిన్ ఈ' గల ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: