చాలామంది ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటారు . మరీ ముఖ్యంగా కొంతమంది స్త్రీలు ఇళ్లలోనే ఉన్నందున,ఇంట్లో దొరికే తీపి పదార్థాలనే కాక, ప్రతి నిమిషము ఏదో ఒకటి నోట్లో నములుతూనే పని చేస్తుంటారు. అది వారి తప్పు కాదు. ఇలా పదేపదే తినాలని కోరిక కలగడం కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొన్ని కారణాలవల్ల మాటిమాటికి ఆకలి వేయడం ఏదోకటి తినాలి అనిపించడం జరుగుతుంది. అసలు ఇలా అనిపించడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చుద్దాం..

ఇళ్లల్లో ఉండే స్త్రీలు సమయానికి ఆహారాలు తీసుకోకపోవడం వల్ల, వారి రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి,మాటిమాటికి ఏదోకటి తినాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు వారు ఎక్కువగా తీపిపదార్థాలు తినడానికి ఇష్టపడతారు. దీనితో నిద్రలేమి ఉబకాయం,ఆయాసం, కిడ్నీ దెబ్బతినడం,గుండెజబ్బు వంటి రోగాలు చుట్టుముడతాయి. ఇలాంటి సమస్య ఎలాంటి వారికి కలుగుతుందో చూద్దాం..

 ప్రోటీన్ లోపం కలవారికి..
చాలామంది ప్రోటీన్ లోపం బాధపడుతుంటారు అలాంటి వారికి శరీరానికి తగిన ప్రోటీన్ అందక, పదేపదే ఏదో ఒకటి తినాలి అనిపిస్తూంటుంది. కావున ప్రోటీన్ ఫుడ్ ని ఎక్కువ తీసుకోవడానికి మొగ్గు చూపాలి.

 తక్కువ కార్బోహైడ్రేట్లు తినేవారికి..
డైట్ పేరుతో తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటుంటారు.శరీరానికి తగిన శక్తి కార్బోహైడ్రేట్స్ ద్వారా వస్తుంది. కానీ ఇలాంటి డైట్ చేయడం వల్ల వారి శరీరానికి కావాల్సిన శక్తి అందక,పదేపదే తినాలని కోరిక కలుగుతుంది.

 నిద్రలేమి గలవారికి..
 సరిగా నిద్ర పట్టని వారికి కూడా సరైన హార్మోన్స్ విడుదల అవ్వక,పదేపదే తినాలని కోరిక పెరుగుతుంది. దీనితో ప్రతి పది నిమిషాలకి ఏదోకటి తింటూనే ఉంటారు.

 ప్రాసెస్డ్ ఫుడ్ తినేవారికి..
ప్రాసెస్డ్ ఫుడ్ లలో తినాలనిపించే కోరిక పెరగడానికి కొన్ని రకాల పదార్థాలను కలుపుతారు. దానితో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల,పదేపదే తినాలనే కోరిక పెరుగుతూంటుంది.

కొవ్వుపదార్థాలు తినని వారికి..
డైట్ పేరుతో శరీరానికి కావాల్సిన మంచికొవ్వులను కూడా ప్రాసెస్ చేసి తినడంతో,శరీరానికి కావాల్సిన శక్తి అందక,మాటిమాటికి ఏదోకటి తినాలనే కోరిక పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: