లావెండర్ మొక్క..
లావెండర్ మొక్క సాధారణంగా మంచి పరిమళభరితమైన సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది.ఇవి మనకు ఇష్టంగా ఉన్నా,దోమలకు ప్రాణాంతకంగా ఉంటుంది.కావున ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల దోమలు ఇంటిలోకి రాకుండా ఉంటాయి.ఈ మొక్కను పెంచుకోవడానికి వీలు లేకపోతే, లావెండర్ నూనెను ఇంటి నిండా స్ప్రే చేయడం వల్ల కూడా దోమలను పారద్రోలవచ్చు.
బంతిమొక్క..
బంతిపూలను సాధారణంగా దేవుళ్లను పూజించడానికి వాడుతూ ఉంటాము.బంతి పూల చెట్లను నాటడం వల్ల ఇందులోని ఫైరేత్రం అనే పరిమళం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా పారిపోతాయి.కావున ప్రతి ఇంట్లో బంతిపూల మొక్కలు నాటు కోవడం చాలా ఉత్తమం.మరియు సులభంగా పెరిగే మొక్క కూడా.
పుదీనా..
పుదీనాను ఇంట్లో పెంచుకోవడం వల్ల,దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడు కోవచ్చు.పుదీనా పెంచుకోవడానికి వీలు లేకపోతే పిప్పర్మెంట్ ఆయిల్ ని ఒక బాటిల్ లో తీసుకొని,ఇల్లంతా స్ప్రే చేయడంతో,ఆ ఘాటైనా వాసనకు దోమలు దరి చేరవు.
తులసి మొక్క..
తులసిలో సాధారణంగా క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.దీనిని వాకిలి పక్కనే పెట్టుకోవడం వల్ల ఇంట్లో కి దోమలు రాకుండా ఉంటాయి. ఒక వేళ ఇంట్లో వున్నా పారిపోతాయి.
రోజ్మేరీ మొక్క..
రోజ్మేరీ మొక్క నుంచి వచ్చే పరిమళం ఎంతో సువాసనభరితంగా ఉంటుంది.కానీ దీనిని దోమలు అస్సలు భరించలేవు కావున.ఇంట్లోని దోమలను పారద్రోలెందుకు రోజ్మెరి మొక్కను పెంచుకోవడం ఉత్తమం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి