ఈ వేసవిలో ఎలాంటి పదార్థాలను తిన్నా,వేడిగా, మంటగా అనిపిస్తూ ఉంటుంది.ఏమైనా చల్లగా తిందామా అనిపిస్తుంది.కానీ నీటి శాతం అధికంగా వున్న ఫ్రూట్స్ అధికంగా తిన్నా ఆకలి తీరక రకరకాల అల్పాహారాలు తీసుకుంటూ వుంటారు.అవి సరిగా డైజెషన్ కాక తెగ ఇబ్బందిగా ఉంటుంది.కడుపులో చల్లగా ఉండటానికి మరియు ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యలతో చేసే అల్పాహారాలు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.అలాంటి చిరుధాన్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెసరపప్పు..

పెసరపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో చల్లగాను వుంటుంది.మరియు అజిర్తి,మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గించుకోవచ్చు.దాని కోసం ఒక కప్పు పెసరపప్పు,ఒక కప్పు బియ్యం కలిపి పొంగల్ చేసి తీసుకోవడం చాలా మంచిది.ముఖ్యంగా వేసవిలో అధికంగా తట్టు వస్తుంది.అలాంటి వారికి పత్యంగా కూడా వీటిని ఉడకబెట్టి ఇస్తుంటారు.పెసరపప్పులోని పోషకాలు వారిని తట్టు నుండి తొందరగా కోలుకునేలా చేస్తుంది.మరియు చిన్నపిల్లలకు సైతం ఉడకబెట్టి ఇవ్వడం వల్ల,వారి ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

రాగి జావా..

రాగులలో క్యాలీషియం,పైబర్,ఐరన్ వంటి పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.దీనికోసం రాగులను ఒకరోజంతా నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయాన్నే వడకట్టి, గుడ్డముక్కలో వేసి మూట కట్టాలి.ఇలానే రెండు రోజుల పాటు వదిలివేయడంతో,మొలకలు వస్తాయి.ఇప్పుడు ఈ మొలకలను నీడలో అరబెట్టి,మెత్తగా మీక్సీ పట్టుకొని జావ కాచుకొని త్రాగటం వల్ల శరీరానికి తేమను అందిస్తుంది.ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.తాగిన వెంటనే పొట్ట నిండిన భావన కలిగి,ఇతర ఆహారాలను తినాలని కోరిక తగ్గిపోతుంది.

జొన్నఅంబలి..

సాధారణంగా జొన్నలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.దీనిని షుగర్ మధుమేహంతో బాధపడేవారు సైతం తరచూ తీసుకోవడం వల్ల వారు మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.దీనికోసం రెండు టీ స్పూన్ల జొన్నపిండి తీసుకుని, అందులో ఒక గ్లాసు నీటిలో కలిపి బాగా ఉడికించుకోవాలి.ఆ తర్వాత చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు,ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయ ముక్కలు,  ఉప్పు వేసి,బాగా కలిపి తీసుకోవాలి.దీనితో కడుపులో చల్లగా ఉంటుంది.చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం,శరీరానికి తేమను అందించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: