
రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తినడం..
పిల్లలు తినే ఆహారాల్లో జింకు లోపం వల్ల,రోగాలకు కారణమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ తో సైనికుడిలా పోరాడే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుందని చాలా పరిశోదనాల్లో కూడా తేలింది.కావున ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పని చేసేందుకు జింక్ అధికంగా ఉన్న గుమ్మడి కాయ,గుమ్మడి గింజలు,బాదాం,పాలు,అరటిపండు వంటి ఆహారాలను అధికంగా ఇవ్వడం అలవాటు చేయండి.
బ్లడ్ క్లాటింగ్ అవకపోవడం..
పిల్లలు తరుచూ దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు.కొంతమందికి బ్లడ్ కొంతసేపు వచ్చి,గాయం దగ్గర బ్లడ్ క్లాట్ అవుతుంది.కానీ జింక్ లోపం కలవారికి బ్లడ్ గడ్డ కట్టకుండా,దారాలంగా రక్తం వస్తూనే ఉంటుంది. రక్తహీనత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున పిల్లలకు బ్లడ్ క్లాటింగ్ సక్రమంగా జరగాలంటే జింకు ఉన్న ఆహారాలు ఎక్కువగా ఇవ్వడం చాలా అవసరం.
థైరాయిడ్ సమస్యలు..
చాలామంది పిల్లలు పోషకాహార లోపం వల్ల ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు తలెత్తి అధిక బరువు అవడం, ఉబకాయం,మానసిక ఒత్తిడి వంటి హార్మోనల్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.అలాంటి వారికి కూడా జింకు కలిగిన ఆహారాలు తప్పకుండా ఇవ్వాలి.
దెబ్బలు తొందరగా మారడం కోసం..
పిల్లలు దెబ్బలు తొందరగా తగిలించుకుంటూ ఉండాలి అలాంటి వారికి తొందరగా గాయాలు మానడానికి జింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
సెన్స్ ఆర్గాన్స్ సక్రమంగా పనిచేయడానికి..
పిల్లల శరీరంలో ఉన్న సెన్స్ ఆర్గాన్స్ అక్రమంగా పనిచేయాలంటే జింక్ చాలా అవసరం.జింక్ లోపంతో బాధపడే పిల్లలకు జింక్ అధికంగా గల గుడ్డు,ఓట్స్, చేపలు,పీతలు వంటి ఆహారాలను అలవాటు చేయడం చాలా మంచిది.