ఉదయం లేవగానే ఎక్కువమంది కాఫీ టీ వంటివి తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.. అయితే ఇలా తాగితేనే చాలామందికి ఉదయం పూట ఏదైనా పనిచేయాలనిపిస్తుంది ముఖ్యంగా తలనొప్పి వచ్చినప్పుడు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ తాగితే కచ్చితంగా అలర్ట్ అయ్యే వారు ఉంటారు అయితే ఇందులో ఎక్కువగా కెఫిన్ అనే పదార్థం ఉండడం వల్ల నిద్ర తగ్గడం శరీరం డిహైడ్రేషన్ వంటి బారిన పడడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట అయితే కాఫీ టీ వంటి వాటిని ఒక మోస్తారు తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


కాఫీలో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.. ఇందులో మెమొరీ అలర్క్ నెస్ మరియు రియాక్షన్ టైం వంటివి చురుకుగా పనిచేసేలా చేస్తాయి అందువల్లే సహజంగా కాఫీని ఎక్కువగా చాలామంది తాగుతూ ఉంటారట ఒక కప్పు కాఫీ తాగితే జీర్ణక్రియలు బాగా జరిగి తక్షణమే శక్తి లభిస్తుందట.. అలసటను తగ్గిస్తుంది.. కాఫీలో ఉండేటువంటి కెఫిన్ పదార్థం రక్తంలో కలిసినప్పుడు వెంటనే మెదడుకు చేరి చాలా చురుకుగా పనిచేసేలా చేస్తుంది దీంతో అలసట కూడా తగ్గుతుందట .


మన శరీరంలోకి కేఫ్ ఇన్ పదార్థం వెళ్ళగానే వేడి పుట్టించి జీవక్రియలను సైతం వేగవంతంగా చేసి కొవ్వుని విచ్చిన్నం చేసి కరగడానికి చాలా ఉపయోగపడుతుంది.. అప్పుడప్పుడు కాఫీ తాగడం వల్ల కెఫిన్లు బ్లాక్ అయిన నరాలను సైతం అలర్ట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది.. కాఫీని ఎక్కువగా తీసుకుంటే కాలయానికి ప్రమాదమట.. ఇంకా మధుమేహం ఉన్నవారు రెగ్యులర్గా తీసుకున్నట్లు అయితే అది కూడా ఒక మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది ఇందులో పొటాషియం మెగ్నీషియం వంటివి ఉంటాయి. వీటివల్ల శరీరంలో రోగాల బారిన పడకుండా చేస్తుంది. అయితే కాఫీని మాత్రం మోతాదు మించి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే అంటూ వైద్యుల సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: