సాధారణంగా ప్రతి ఒక్కరికి అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసు.కానీ అరటిపువ్వు వల్ల కూడా ప్రయోజనం కలుగుతుందని చాలా అరుదుగా తెలుస్తుంది.అవును మనము ఎప్పుడూ అరటిపండు తినడంతో భోజనం కంప్లీట్ అయిన భావన కలగడమే కాకుండా,దానివల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అలాగే అరటిపువ్వుతో కూడా చాలా చాలా రోగాలను తరిమికొట్టవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.అవేంటో మనము చూద్దామా..

అస్సలు అరటి పువ్వులో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.అవి తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు విడిచిపెట్టరు.ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్,ప్రోటీన్లు,పొటాషియం,విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా లభిస్తాయి.

వీర్యకణ వృద్ధికి ..

సాధారణంగా కొంతమంది మగవాళ్ళల్లో స్పెర్ముకౌంటు తగ్గడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము.వారికోసం అరటిపువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాంటి వారు వారంలో రెండు నుంచి మూడుసార్లు అరటిపువ్వుతో తయారుచేసిన వంటకాలు తీసుకోవడం వల్ల లేదా అరటిపువ్వు రసాన్ని తాగడం వల్ల వారికి వీర్యకణ వృద్ధి వృద్ధి చెందుతుంది.

గుండె జబ్బులు..

చాలామంది యువతలో గుండె ఫోటు వచ్చినప్పుడు అక్కడికక్కడే చనిపోతూ ఉన్నారు.అలాంటి సమస్యలు యువతకు రాకుండా ఉండాలంటే అరటిపువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది.యువత కూడా తరచూ అరటిపూత తయారు చేసిన వంటకాలు తినడం చాలా ఉత్తమం.

రక్తహీనత తగ్గించుకోవడానికి..

చాలామంది గర్భిణీ స్త్రీలు రక్తహీనత బాధపడుతూ ఉంటారు.అటువంటి వారికి రోజూ అరటిపువ్వు రసాన్ని కానీ అరటి పువ్వుతో తయారు చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల,ఇందులోని ఐరన్ కంటెంట్ రక్తహీనతను తగ్గిస్తుంది.

జీర్ణశక్తికి..

అరటి పండు కానీ,అరటి పువ్వు కానీ జీర్ణశక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.ఇందులోని ఫైబర్ కంటెంట్ వల్ల ఆహారం జీర్ణమై మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.


హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్..

హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ తో బాధపడే స్త్రీలకు అరటిపువ్వును తేనెలో రంగరించి తాగించడం వల్ల,వారి సమస్యకు ఉపశమనం వెంటనే కలుగుతుంది.అంతేకాక సరైన పిండం అభివృద్ధి చెందడం వంటి గర్భాశయ రోగాలను తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి..

రోగాలను తరిమి కొట్టే మన రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి అంటే,అరటి పండులోని విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది.కావున ఈసారి ఎక్కడైనా అరటిపువ్వు కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చి తినడం చాలా మంచిది .

మరింత సమాచారం తెలుసుకోండి: