ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు,జీవన శైలి కారణాలుగా అనారోగ్యాలు వస్తూ ఉండడమే కాకుండా, రకరకాల పదార్థాలను తింటూ ఉండడంతో పళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటు వుంది.అనవసరమైన ఆసిడిక్ విలువలు కలిగిన జంక్ ఫుడ్ తీసుకోవడంతో, పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతిని,పళ్ళు పుచ్చిపోవడం గార పట్టడం,పాచి పట్టడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు.పొద్దున లేవగానే ప్రతి ఒక్కరు బ్రష్ చేయడం తప్పనిసరిగా చేస్తారు కానీ ఆ టూత్ పేస్ట్ వల్లే పళ్ళు దెబ్బతింటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూవున్నారు.అటువంటి వారికోసం కొన్ని రకాల ఆకులను నమలడం వల్ల పళ్ళ ఆరోగ్యం మెరుగుపడి మిలమిల మెరుస్తాయని కూడా చెబుతున్నారు. ఆకులను వీలైనప్పుడు నములుతూ ఉన్నట్టయితే అందులో ఉన్న సుగుణాలు,దంత సమస్యలను తగ్గించి పళ్ళు మెరిసేందుకు దోహదపడతాయట.మరి అటువంటి ఆకులు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

వేపాకు..

వేపాకు అనేది సర్వరోగ నివారణ అని చెప్పవచ్చు. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ గుణాల వల్ల,పళ్ళను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.తరచూ వేపాకు నమలడం కానీ వేపపుల్లతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్లపై ఉన్న ఎనామిల్ దెబ్బతినకుండా,పళ్ళపై ఉన్న బ్యాక్టీరియా సమూలంగా నాశనం అవుతుంది.దీనితో ఎటువంటి పళ్ళు సమస్యలు దర చేరక,పళ్ళు మిలమిల మెరుస్తాయి.

తులసి ఆకులు..

తులసి ఆకులను తరచు నమలడంతో,ఇందులో ఉన్న విటమిన్ సి,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.తులసి ఆకలను నమల్లడం కానీ,తులసి నీళ్లు పుక్కలించడంతో కానీ చేయడం వల్ల,ఎటువంటి పంటి సమస్య అయినా తొందరగా తగ్గిపోతుంది.మరియు పంటి నొప్పితో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.

జామాకు..

ఎవరి పళ్లకైనా పాచి పట్టడం,గార పట్టడం పుచ్చిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే,వారికి జామాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పంటి సమస్యలు బాధపడేవారికి రోజుకు రెండుసార్లు జామ ఆకులు నమలడం వల్ల,అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చెడు బ్యాక్టీరియాని చంపేసి, పళ్ళ సమస్యలను తగ్గిస్తాయి.అంతేకాక నోటి పూతతో బాధపడేవారికి కూడా జామాకు చాలా బాగా పనిచేస్తుంది.కావున మీరు కూడా మీ పళ్ళను మెరిపించుకోవాలంటే ఈ మూడు ఆకులను తరచూ నమలడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: