ఇల్లే కదా అందరికీ భూతలా స్వర్గం.అలాంటి ఇళ్ళు పాజిటివ్ వైబ్స్ వెదజల్లితేనే,అ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా,ఆహ్లాదంగా ఉండి,పాజిటివ్ మైండ్ ఏర్పడి, వారు అనుకున్న కేరిర్ లో అభివృద్ధి వైపు ముందుకు సాగుతారు.అలాంటి ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటే చాలు,వారింట్లోకి లక్ష్మి దేవి ఆనందంగా అడుగు పెడుతుంది.అంతేకాక వారింట్లో ఆర్థిక మరియు అనారోగ్య సమస్యలు,గొడవలు,చికాకులు అన్ని తగ్గిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు.మరి అవేంటో తెలుసుకుందాం పదండీ..

మనీ ప్లాంట్..

చాలా మంది ఇంటి ముందు కుండీల్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. మరియు ఇది ఈజీగా పెంచుకోవచ్చు.ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడంతో డబ్బుకు కొరత ఉండదని చెబూతున్నారు.ఇది అదృష్టాన్ని ఆకర్షించేందుకు సహాయపడుతుంది.దీనిని ఇంటికి ఉత్తర దిక్కున గాజు లాంటి కుండీలో మనీ ప్లాంట్ నాటుకోవాలి.అయితే మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా ఎండిపోకుండా చూసుకోవాలి.అప్పుడే ఇంటికి సుఖశాంతులు కలుగుతాయి.

వెదురు చెట్టు..

వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు చెట్టుని అదృష్టం తెచ్చే చెట్టుగా భావిస్తారు.ఈ మొక్కని కచ్చితంగా ఉత్తర దిశలో పెట్టుకోవడంతో చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.ఈ చెట్టు మీ ఇంటికి అదృష్ట దేవతను తీసుకొచ్చి,ప్రతికూల శక్తులని దూరం చేస్తుంది.

తులసి..

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కకూ చాలా పవిత్రమైన స్థానం ఉంది.ప్రతి ఒక్క స్త్రీ తులసి కోటకి పూజ చేయడం చాలా మంచిది.తులసిని లక్ష్మీదేవి ప్రతి రూపంగా భావిస్తారు.ఈ మొక్కను ఉత్తర దిక్కున ఉంచి పూజించడంతో ధనవర్షం కురుస్తుంది.మరియు ఆటంకాల వల్ల ఆగిపోతూ వస్తున్న పనులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరుగుతాయి.

అరటి చెట్టు..

అరటి చెట్టుని ఇంటి ఉత్తర దిశలో పెంచుకోవడం వల్ల డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు.ఈ చెట్టును ప్రతి గురువారం పూజించడం వల్ల విష్ణువు అనుగ్రహం పొందుతారు.అలాగే అరటి చెట్టు మీద ప్రతి గురువారం అరటి చెట్టు మీద నెయ్యి దీపం వెలిగించి పూజించాలి.అలా చేయడంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది.మరియు జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి.కావున మీరు కూడా పైన చెప్పిన వాటిల్లో కనీసం  రెండు మూడు మొక్కలను మీ ఇంటికి తెచ్చి, పెంచుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: