నేటి కాలంలో చాలామంది స్త్రీలు, పురుషులు 30 ఏళ్లు పైబడిన వివాహం చేసుకోవడం లేదు. దానికి అనేక రకాల కారణాలు ఉంటున్నాయి. కొంతమంది వారు నచ్చిన వ్యక్తి దొరకక వివాహం చేసుకోవడం లేదు. వారు పెళ్లి చేసుకునే జీవిత భాగస్వామి చాలా అందంగా, హ్యాండ్సమ్ గా కనిపించాలని ఉద్దేశంతో ఎవరిని కూడా పెద్దగా ఇష్టపడరు. వారికి నచ్చేంత వరకు వెతుకుతూనే ఉంటారు. అలా వయసు పెరిగిపోతుంది. మరి కొంతమంది వారి పూర్తి ఫోకస్ చదువు మీద పెట్టడం వల్ల వివాహం చేసుకోవడం ఆలస్యం అవుతోంది. ఎక్కువగా చదువుకోవడం, ఆపై జాబ్ కోసం వెతకడంలోనే వారి వయసు 30 కి పైనే అవుతోంది. చాలామందికి జాబ్ దొరకక అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

చదువుకున్నప్పటికీ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు. ఉద్యోగం వచ్చినప్పటికీ సంపాదన తక్కువగా ఉందని మరికొంతమంది ఆలస్యం చేస్తారు. సంపాదన ఎక్కువగా వచ్చినప్పుడే వివాహం చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అని ఉద్దేశంతో మరికొంతమంది వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు. కొంతమంది స్త్రీలు, పురుషులు వివాహం అంటేనే భయపడిపోతున్నారు. దానికి గల ప్రధాన కారణం నేటి కాలంలో చాలా మంది చిన్న చిన్న గొడవలకు భయపడి వివాహం చేసుకోవడం లేదు. ప్రస్తుత కాలంలో చాలామందికి పెళ్లి అంటే ఆటలాగా అయిపోయింది. చిన్న చిన్న విషయాలకు గొడవలు, విడిపోవడం ఇలాంటివి చేస్తున్నారు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.

 మరి కొంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల విడాకులు తీసుకుని పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి గొడవలు నేటి కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ఆ కారణంగా చాలామంది గొడవలకు భయపడి వివాహం చేసుకోవడం లేదు. కొంతమంది స్త్రీలు, పురుషులు కోపం ఎక్కువగా ఉండడం వల్ల వివాహాలు చేసుకోవడానికి భయపడుతున్నారు. వివాహమైన తర్వాత కోపంతో రగిలిపోతే ఏమవుతుందో అనే భయంతో మరి కొంతమంది వివాహం చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. మరికొంతమంది ఎవరో ఒకరిని ప్రేమించడం వారిని వివాహం చేసుకోవాలని అనుకోవడంతో వారి జీవితం 30కి పైనే అవుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం, ఏదో ఒక సమస్యల కారణంగా వివాహం చేసుకోకుండా ఉంటున్నారు. ఇంట్లో చూసిన వారిని చేసుకోవడం ఇష్టం లేక అలానే ఉండిపోతున్నారు.


మరి కొంతమంది అక్రమ సంబంధాల కారణంగా వివాహం చేసుకోవడం లేదు. వారి కన్నా వయసులో పెద్దవారిని, వివాహం అయిన వారితో సంబంధం పెట్టుకోవడం వారి నుంచి ఏదో ఒకటి ఆశించడం ఇలా చేయడం వల్ల వివాహాలు చేసుకోలేకపోతున్నారు. కానీ అది చాలా తప్పు. కానీ పూర్వకాలంలో చాలా తక్కువ వయసులో వివాహాలు జరిగేవి. వారు చాలా ఓపికగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని చాలా సంతోషంగా ఉండేవారు. నేటి కాలంలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. వివాహం అంటేనే ఎవరు పెద్దగా లెక్క చేయడం లేదు. చిన్న చిన్న గొడవలు, అక్రమ సంబంధాలు కారణంగా అనేకమంది వివాహాలు చేసుకోవడం మానేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: