సాధారణంగా ప్రీ డయాబెటిస్ సాధారణంగా ఎటువంటి లక్షణాలు చూపించదని వైద్యులు చెబుతున్నారు. చాలామందికి ప్రీ డయాబెటిస్ ఉందని డాక్టర్ రక్త పరీక్ష చేసినప్పుడు మాత్రమే తెలిసే అవకాశాలు ఉంటాయి. పెరిగిన దాహం, తరచుగా మూత్ర విసర్జన, అలసట, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు ప్రీ డయాబెటిస్ సంకేతాలు అని చెప్పవచ్చు. మీరు సాధారణం కంటే ఎక్కువగా దాహం వేస్తుందని అనిపిస్తే షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది.

రాత్రి సమయంలో  సాధారణం కంటే తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి  వస్తున్నా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.  ఈ సమస్య ఉన్నవారిలో  సాధారణం కంటే ఎక్కువ అలసటగా అనిపించవచ్చు.  డయాబెటిస్ తో బాధ పడేవాళ్ళకు   అస్పష్టంగా లేదా మసకగా కనిపించవచ్చు. కొన్నిసార్లు చర్మం పొడిబారడం లేదా దురద పెట్టడం వంటి  లక్షణాలు సైతం కనిపిస్తాయి.  ఈ సమస్య ఉన్నవాళ్లలో  గాయాలు, దెబ్బలు  మామూలు కంటే నెమ్మదిగా  తగ్గుతాయి.

ప్రీ డయాబెటిస్ అంటే మీ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.  కానీ మధుమేహం (డయాబెటిస్) అని నిర్ధారించడానికి ఈ స్థాయిలు సరిపోవు.  ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.  ప్రీ డయాబెటిస్ ను గుర్తించి, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం (వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం) ద్వారా టైప్ 2 డయాబెటిస్ రాకుండా నివారించడం  చేయవచ్చు.

ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో  పాటు వైద్యుల సలహాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.  డయాబెటిస్ నిర్ధారణ అయితే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు.  నిత్య జీవితంలో మధుమేహం బారిన పడిన వాళ్ళు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: