ఇంటి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నప్పుడు ఇతర అనవసరపు అప్పులు చేయకుండా చూసుకోవడం ఉత్తమం. ఇంటి కొనుగోలుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఇల్లు కొనాలనుకుంటున్న ప్రాంతంలో మార్కెట్ విలువ ఎంత ఉందో, చుట్టుపక్కల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం వలన సరైన రేటుకు బేరం చేయవచ్చు.
మీకు అందుబాటు ధరలో ఉన్న ఇల్లు లేదా స్థలం లభించే మంచి ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి కాబట్టి, కొంచెం దూరమైనా మీ బడ్జెట్‌లో ఇల్లు దొరికే అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న అన్ని సౌకర్యాలు, ధర ఒకేచోట దొరకకపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు, లేదంటే సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది.
ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసేటప్పుడు పత్రాలు, రిజిస్ట్రేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. బడ్జెట్ ధరలో ఇల్లు దొరకడం కష్టమైనా, మీ ప్రయత్నాన్ని విరమించుకోవద్దు. మీకు అందుబాటులోకి వచ్చిన ప్రతి ఇంటిని ఒకసారి చూసి రండి. అద్దె ఇంట్లో నివసించే వారు, పూజా స్థలంలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి