తూర్పు గోదావరి జిల్లాలో ప్రజల నాడి ఏ మాత్రం చిక్కని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమే. ఇక్కడ ఏ పార్టీ ఎప్పుడు గెలుస్తుందో అర్ధం కాకుండా ఉంటుంది. మొదట నుంచి ఈ నియోజకవర్గ ప్రజలు వెరైటీ తీర్పు ఇస్తూనే ఉంటారు. 1983, 1985 ఎన్నికల్లో టి‌డి‌పిని గెలిపిస్తే, 1989లో కాంగ్రెస్‌ని గెలిపించారు. ఇక 1994లో టి‌డి‌పి గెలిస్తే, 1999లో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధి గెలిచారు. 2004లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి ఉంటే పిఠాపురంలో వెరైటీగా బి‌జే‌పి గెలిచింది.

2009లో ఏమో ప్రజారాజ్యం పార్టీని గెలిపించారు. 2014 ఎన్నికల్లో టి‌డి‌పి టికెట్ దక్కలేదని ఇండిపెండెంట్‌గా నిలబడ్డ ఎస్‌వి‌ఎస్‌ఎన్ వర్మని గెలిచారు. అది కూడా 47 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత వర్మ ఎలాగో టి‌డి‌పిలోకి వచ్చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. వైసీపీ తరుపున పెండెం దొరబాబు విజయం సాధించారు. అయితే ఈయనే 2004లో బి‌జే‌పి తరుపున గెలిచారు.

ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దొరబాబు..తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. పిఠాపురంలో ప్రభుత్వం తరుపున జరిగే అన్నీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఎమ్మెల్యేగా దొరబాబు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. అలాగే ఈయన మీద పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. నియోజకవర్గంలో దందాలు చేస్తున్నారని, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అటు ఇసుక, ఇళ్ల స్థలాలు, పోలవరం కాలువ గ్రావెల్‌ తవ్వకాల్లో అక్రమాలు గట్టిగానే జరిగాయని తెలుస్తోంది. అటు ఎమ్మెల్యే పి‌ఏ ఆగడాలకు కూడా అడ్డు అదుపులేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. తమ అక్రమాలకు అడ్డు వచ్చేవారిపై పి‌ఏ అక్రమ కేసులు కూడా పెట్టిస్తున్నారని తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకరకాలుగా ఎమ్మెల్యేకు నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ టి‌డి‌పి నేత వర్మకు బాగా బెనిఫిట్ అవుతుంది. పైగా ఈయన ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇంకాస్త పుంజుకుంటే నెక్స్ట్ పిఠాపురంలో వర్మదే పైచేయి అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: