విజయనగరం జిల్లాపై బొత్స సత్యనారాయణకు ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయనగరం పార్లమెంట్ స్థానంతో పాటు నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్ధులని గెలిపించుకునే సత్తా బొత్సకు ఉంది. గత ఎన్నికల్లో అదే జరిగింది. బొత్స ప్రభావం వల్ల వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఓ రకంగా జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడానికి కారణం కూడా బొత్స అనే చెప్పొచ్చు.

అయితే బొత్స అండతోనే ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య కూడా సత్తా చాటుతున్నారు. అన్నకు అండగా ఉంటూ వచ్చిన అప్పలనరసయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గజపతినగరంలో పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓట్లు బాగానే తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినా సరే బొత్స సోదరుడు మాత్రం సత్తా చాటారు. ఇక ఆ తర్వాత బొత్సతో పాటు కలిసి వైసీపీలో చేరి...2019 ఎన్నికల్లో మరొకసారి గజపతినగరం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే అప్పలనరసయ్య ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది...మరి ఈ రెండున్నర ఏళ్లలో అప్పలనరసయ్య ఎమ్మెల్యేగా రాణిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే....ఎమ్మెల్యేగా అప్పలనరసయ్య సత్తా చాటుతున్నారని తెలుస్తోంది. ఆయన పనితీరుకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం....వారికి కావల్సిన పనులు చేసి పెట్టడంలో సత్తిబాబు తమ్ముడు ముందే ఉన్నారు. పైగా అన్న మంత్రి కావడంతో అభివృద్ధి పనులు బాగానే చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అదనంగా ప్లస్ అవుతున్నాయి.

అయితే గజపతినగరంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి...రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ. గజపతినగరంలో తాగునీటి సమస్య కూడా ఎక్కువే. ఇటు రాజకీయంగా వస్తే అప్పలనరసయ్యకు అసలు తిరుగులేదు. టి‌డి‌పి తరుపున అప్పలనాయుడు పనిచేస్తున్నారు...ఈయన పార్టీలో అంతగా యాక్టివ్ గా లేరు...పైగా ఇక్కడ టి‌డి‌పిలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. అవే అప్పలనరసయ్యకు ప్లస్ అవుతున్నాయి. ఏదేమైనా సత్తిబాబు తమ్ముడుని ఓడించడం మళ్ళీ కష్టమే అని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: