ఇప్పుడు ఆంద్రఫ్రదేశ్ లో సుమారు 2000 వేల వరకూ ధియేటర్లు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొదటి థియేటర్ గురించి ఎప్పుడు మనం తెలుసుకుందాం.

సినిమాలు అప్పుడప్పడే సమాజానికి పరిచయం అవుతున్న దశలో టూరింగ్ టాకీసుల్లో సినిమాలను ప్రదర్శించేవారు. ఒక ఖాళీ ప్రదేశంలో టెంట్ లతో థియేటర్లను నిర్మించి ఇందులో సినిమాలను ప్రదర్శించేవారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో  విజయవాడలో తొలిసారిగా శాశ్వత ధియేటరను నిర్మించారు. 1921లో మారుతీ సినిమా పేరుతో ఒక ధియేటర్ ను పోతిన శ్రీనివాసరావు గారు నిర్మించారు.

ఈ మారుతి సినిమా ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన తొలి సినిమా ధియేటర్ గా పేరు తెచ్చుకుంది. అలాగే సికింద్రాబాద్ లోని ప్యారడైజ్  ఆంధ్ర ప్రదేశ్ లోని తొలి ఏసి ధియేటర్ గా పేరు తెచ్చుకోగా, హైదరబాద్ లోని రామకృష్ణ ధియేటర్ తొలి 70 ఎంఎం ధియేటర్ గా రికార్డుల్లో నమోదు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: