అణుబాంబు పేలితే ఎంత నష్టం వస్తుందో తెలియదుగాని, బాలీవుడ్ ఐటమ్ బాంబ్ సాంగ్ చేసింది అంటే దానికి వచ్చే రెస్పాన్స్ మాములుగా ఉండదు.  ఆమె కేవలం సినిమాలకు మాత్రం పరిమితం కాలేదు.  సినిమాలతో పాటు అప్పట్లో ఓ పార్టీని కూడా పెట్టింది.   పోటీ కూడా చేసింది.  గెలవలేదు అది వేరే విషయం అనుకోండి.  ఇంతకీ ఆమె ఎవరు అనే డౌట్ వచ్చింది కదా.  ఆమె ఎవరో కాదు రాఖి సావంత్.  


రాఖీ సావంత్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  రాఖీ సావంత్ ఓ విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి.  ముంబైలోని ఓ హోటల్ లో వీరి పెళ్లి జరిగినట్టు మీడియాలో పుకార్లు రావడంతో రాఖీ సావంత్ షాక్ అయ్యింది. 

దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.  "తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేశారు. హోటల్‌లో బ్రైడల్‌ ఫొటోషూట్‌ జరిగిందని పేర్కొన్నారు. జేడబ్యూ మారియట్‌ హోటల్‌లో బ్రైడల్‌ షూట్‌ జరిగింది. నాకు పెళ్లి జరిగిపోయిందని జనాలు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదు. నాకు వివాహం కాలేదు. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. నేను సింగిల్‌గా ఉన్నా" అని చెప్పింది రాఖీ సావంత్. 


గతంలో రాఖీ సావంత్ తన పెళ్ళికి సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడి చేసిన సంగతి తెలిసిందే.  ఇండియాస్ గాట్ టాలెంట్ లో కంటెస్టెంట్ గా పోటీ చేసిన దీపక్ కాలాల్ ను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  దీనిని అప్పట్లో రాఖీ సావంత్ చెప్పింది.  


వీరి వివాహం లాస్ ఏంజెల్స్ లో జరుగుతుందని కూడా పేర్కొంది.  ఏమైందో ఏమో తెలియదుగాని, ఆ వివాహం జరగడం లేదని ఆ తరువాత రాఖీ సావంత్ పేర్కొంది.  "నేను చాలా మంచి అమ్మాయిని.  నావలన మా అమ్మ, సోదరుడు బాధపడుతున్నారు.  చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను.. నేను పెళ్లి చేసుకోలేను " అని చెప్పి అప్పట్లో తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: