బాలీవుడ్ లో తన హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తున్న ఊర్వశి రౌతెలా సనమ్ రే, హేట్ స్టోరీ 4 లో నటించి మెప్పించింది. ఈ ఇయర్ వర్జిన్ భానుప్రియ సినిమాతో కూడా అలరించిన ఈ అమ్మడు అడ్డు అదుపులేని అందాల ప్రదర్శన చేయడంలో వెనుకాడని ఊర్వశి ఇప్పుడు తెలుగులో బ్లాక్ రోజ్ సినిమా చేస్తుంది. డైరక్టర్ సంపత్ నంది నిర్మిస్తున్న ఈ సినిమాను మోహన్ భరధ్వాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈమధ్యనే బ్లాక్ రోజ్ షూటింగ్ మొదలు కాగా అప్పుడే ఊర్వశికి తెలుగు మేకర్స్ టాలెంట్ అర్ధమైనట్టు ఉంది. అందుకే ఆమె మరో సినిమా కూడా చేస్తానని ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది. అంతేకాదు అడల్ట్ సబ్జెక్టులను చేసేందుకు తాను ఓకే అంటుందట. బ్లాక్ రోజ్ తో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ తన అందాలతో తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకోవాలనే పెద్ద స్కెచ్ తోనే అమ్మడు వచ్చినట్టు ఉందని అంటున్నారు.

ఇక మోహన్ భరధ్వాజ్ సినిమాలో కూడా ఊర్వశి కాల్ గాళ్ గా నటిస్తుందని తెలుస్తుంది. బాలీవుడ్ అందాల భామని తెచ్చి అందులోనూ ఓ అడల్ట్ కథతో తెరకెక్కిస్తుంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాపై ఆసక్తి చూపకుండా ఉంటారా.. తెలుగులో ఊర్వశి చేస్తున్న మొదటి సినిమానే అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ రిలీజ్ అయితే అమ్మడికి వరుస క్రేజీ ఛాన్సులు వస్తాయని అంటున్నారు. చూస్తుంటే బాలీవుడ్ అందాల భామకి తెలుగులో బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.                                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: