ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా శృతిహాసన్ పేరు ప్రఖ్యాతలు  ఘడించింది.  తెలుగు,తమిళ భాషల్లో కూడా శృతిహాసన్  పేరు సంపాదించుకుంది. గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె కమల్ హాసన్ కూతురు. ఇదిలా ఉండగా నిన్న  తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృతిహాసన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. అయితే ఎన్నికల అనంతరం కమల్ హాసన్ తో కలిపి శృతి కమల్ పోటీ చేసిన పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అయితే ఇక్కడ ఈమె చేసిన ఒక తప్పు వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


 నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ తో కలిసి శృతిహాసన్ ,  శృతి కమల్ పోటీ చేస్తున్న పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. ఇక ఎన్నికల రూల్స్ ప్రకారం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లు, పోలింగ్ ఏజెంట్లు,  మీడియా వ్యక్తులు మాత్రమే  పోలింగ్ బూత్ లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే హీరోయిన్ అటువంటి శృతిహాసన్ మాత్రం ఎటువంటి గుర్తింపు లేకపోయినా ఆమె పోలింగ్ బూత్ లోకి వెళ్లడం పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల అధికారికీ శృతిహాసన్ పై ఫిర్యాదు నమోదు చేశారు.


అయితే ఎన్నికల అధికారులు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ నుంచి పోటీ చేశారు. బీ జే పీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ కథ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక హీరోయిన్ శ్రుతిహాసన్ తన ఫిర్యాదు పై ఎలాంటి స్పందన ఇస్తుందో.. లేదో.. చూడాల్సి ఉంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీ జే పీ నేతలు కోరుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

అంతే కాకుండా శృతిహాసన్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ట్విట్టర్ ద్వారా తన తండ్రి పార్టీ అయిన మక్కల్ నీది మయ్యం కు ఓటు వేయమని చెప్పడం కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే శృతి హాసన్ తప్పు మీద తప్పు చేస్తున్నారని బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: