సాధారణంగా సంగీతదర్శకులకు ఒక ఫుల్ లెంత్ మ్యూజికల్ ఫిల్మ్ తీయాలని బాగా కోరిక గా ఉంటుంది. ఈ మ్యూజికల్ ఫిల్మ్స్ తో తమ సంగీత ప్రతిభను ప్రేక్షకులకు తెలియజేయాలని మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకుంటారు. అంతేకాకుండా తమ మ్యూజిక్ తో ఒక సినిమాని కళాఖండంగా మార్చాలి అనుకుంటారు. అందరికీ మ్యూజిక్ ఫిలిమ్స్ తీసే అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేవిశ్రీ ప్రసాద్ కి ఇద్దరమ్మాయిలతో సినిమాతో తన మ్యూజిక్ టాలెంట్ నిరూపించే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తనకు ఓ మ్యూజిక్ ఫిల్మ్ చేయాలనే కోరిక కూడా తీరిపోయింది.


ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో ఒక గిటారిస్ట్. హీరోయిన్ కోమలి శంకరాభరణం (అమలాపాల్) సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. వయోలిన్ కూడా నేర్చుకోవాలని ఈమె బ్రహ్మానందం వద్ద విద్యార్థినిగా చేరుతుంది. ప్రధాన పాత్రలన్నీ కూడా సంగీత రంగం లోనే మునిగి తేలుతుంటే దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించి.. మ్యూజిక్ పరంగా సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని రన్ రన్ పాటను ప్రముఖ బ్రిటిష్ సింగర్ అపాచే ఇండియన్ చేత పాడించారు.



నిజానికి ఆయన పాడిన మొట్ట మొదటి తెలుగు పాట దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలోనే! ఇక ఈ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 2013 సంవత్సరం నుంచి ఇప్పటికీ రన్ రన్ పాట తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లో మోగుతూనే ఉంది. ఈ పాట వింటుంటే దానంతట అదే ఉత్సాహం తన్నుకొస్తుంది. ఫాస్ట్ బీట్, టెంపో, అదిరిపోయే వోకల్స్ రన్ రన్ పాటను సూపర్ హిట్ చేశాయి. "శంకరాభరణం తో స్నానం చేస్తా" పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. సాఫ్ట్ బేస్ తో స్వరపరిచిన వయోలిన్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే నాలుగు కోట్ల 20 లక్షల వ్యూస్ సంపాదించింది. ఈ పాటలో వయోలిన్ తో సృష్టించిన సంగీతం నేరుగా హృదయాలను తాకుతుంది. దేవిశ్రీ అందించిన సంగీత స్వరాలు దుఃఖమైన మానసికావస్థ ను సైతం పోగొడుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను డేవిడ్, అనిత చాలా చక్కగా పాడారు అని చెప్పవచ్చు. ఇక టాపు లేచిపోద్ది పాట కూడా హిట్ అయ్యింది. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: