కమల్ హాసన్ పేరు సినిమా లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సీనియర్ హీరో తనకంటూ ప్రత్యేక సుస్థిర స్థానాన్ని సంపాధించుకున్నారు. కమల్ హాసన్ విశ్వనటుడిగా సుపరిచితం. ప్రస్తుతం ఆయన కూతుళ్లు శ్రుతి హాసన్ అక్షర హాసన్ కూడా సినిమాలు చేస్తూ... బిజీగా గడుపుతున్నారు. శ్రుతి హాసన్ తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు చేసి ఇక్కడ వారికి సుపరిచితం అయింది. పవర్ స్టార్ హీరోగా ఈ అమ్మడు ముద్ర వేయించుకుంది. పవర్ స్టార్ తో అనే కాకుండా టాలీవుడ్ లో ఉన్న అందరు బడా హీరోలతో ఈ ముద్దు గుమ్మ జత కట్టింది. సీనియర్ హీరో కమల్ హాసన్ నేటికీ వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ...తనలో నటన ఇంకా మిగిలే ఉందని నిరూపిస్తున్నాడు. ఈయన తమిళనాట స్థాపించిన పొలిటికల్ పార్టీ మక్కల్ నీది మయ్యం అసెంబ్లీ ఎన్నికలల్లో అంతగా ప్రభావం చూపించలేక పోయింది.


తాజాగా ఈ సీనియర్ హీరో మోదీ సారధ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సినిమాటోగ్రఫీ చట్ట (2021) సవరణ ప్రతిపాదనపై స్పందిస్తూ... చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాల విడుదలపై పెద్ద  అయిన సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను కూడా పక్కన పెట్టి మరీ సమీక్ష చేసే అధికారాలను కేంద్రానికి కట్టబెట్టడం తగదని కుండ బద్దలు కొట్టారు. కేంద్రం చేసిన ఈ ఆలోచన సరిగా లేదని విమర్శించాడు. దీనిని కోలీవుడ్ ఇండస్ర్టీ వ్యతిరేఖిస్తుందని తెలిపాడు. ఇటీవల చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన విశ్వనటుడు కమల్ హాసన్ చెడు వినకూడదు... మాట్లాడకూడదు..  అన్న కోతుల్లా చోద్యం చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ చట్టంపై సినీ వర్గాల వారు జూలై 2 లోగా స్పందన తెలియజేయాలని కేంద్రం తెలిపింది. ఇది నిర్మాతల భావ ప్రకటనా స్వేచ్చకు భంగం కలిగించడమేనని దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.  ఇలాంటి సవరణలతో నష్టమే తప్ప లాభం ఉండదని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: