అలనాటి అందాల నటి నగ్మా 1990వ ద‌శ‌కంలో త‌న అంద చందాల‌తో అన్ని సినిమా ఇండ‌స్ట్రీల‌ను ఓ ఊపు ఊపేసింది. తెలుగులో పెద్ద హీరోలు అంద‌రి ప‌క్క‌న ఆమె న‌టించిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్ అయ్యాయి. నాగార్జున‌తో ఆమె నటించిన కిల్లర్, అల్లరి అల్లుడు - మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న రిక్షావోడు, ఘరానా మొగుడు సినిమాల్లో చేసింది. ఇక బాల‌య్య‌తో అశ్వ‌మేథం సినిమా చేసింది. ఆమె తెలుగులోనే కాకుండా , అటు త‌మిళంలో కూడా ఒకేసారి నెంబ‌ర్ వ‌న్ హీరోగా నిలిచింది. అప్ప‌ట్లో కోలీవుడ్ లో స్టార్ హీరోలు అంద‌రితోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. ఇక చివ‌రిగా ఆమె తెలుగులో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమా లో అత్త పాత్రలో నటించింది.

న‌గ్మా 1974లో మహారాష్ట్రలోని ముంబైలో హిందూ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టింది. సూర్య భార్య జ్యోతిక‌, మాస్ట‌ర్ హీరోయిన్ రోషిణి న‌గ్మాకు స్వ‌యానా చెల్లెల్లు అవుతారు. నగ్మా ఇప్పటికి 45 సంవత్సరాలు అయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆమె భార‌త మాజీ కెప్టెన్ గంగూలీతో ప్రేమాయ‌ణం న‌డిపింది. వీరు అప్ప‌ట్లో కాణిపాకంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. గంగూలీతో గ్యాప్ వ‌చ్చాక ఆమె త‌మిళ్ హీరో శ‌ర‌త్ కుమార్ తో ప్రేమాయ‌ణం న‌డిపింది. అయితే ఆయ‌న‌కు అప్ప‌టికే పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉన్నారు.

ఆ త‌ర్వాత భోజ్‌పురి హీరో ర‌వికిష‌న్‌ను ప‌ట్టేసి అత‌డితో కొద్ది రోజులు ప్రేమాయ‌ణం న‌డిపింది. త‌ర్వాత ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత ఆమె మ‌రో భోజ్‌పురి న‌టుడు మ‌నోజ్ తివారితో ప్రేమ‌లో ప‌డింద‌ని అంటారు. వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం ఫుల్లుగా న‌డిచింది. త‌ర్వాత అత‌డికి కూడా ఆమె దూర‌మైంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు న‌గ్మా కాంగ్రెస్ లో ఉంటే... మ‌నోజ్ తివారి, ర‌వికిష‌న్ ఇద్ద‌రూ బీజేపీ ఎంపీలుగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: